కింగ్ ఆఫ్ కామెడీ టైమింగ్ అల్లరి నరేష్ బర్త్‌డే సందర్భంగా ఆయన టైటిల్ రోల్ పోషిస్తోన్న 'బంగారు బుల్లోడు' సినిమా టీజర్ జూన్ 30 మధ్యాహ్నం 3:06 గంటలకు విడుదలయ్యింది. పి.వి. గిరి దర్శకత్వంలో ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ సరసన నాయికగా అందాల తార పూజా ఝవేరి నటిస్తోంది.
ఒక నిమిషం నిడివి కలిగిన ఈ టీజర్ ద్వారా 'బంగారు బుల్లోడు' చిత్రం ఆద్యంతం మనల్ని నవ్వుల్లో ముంచెత్తుందని అర్థమవుతోంది. కామెడీ టైమింగ్‌లో తాను కింగ్‌నని మరోసారి ఈ చిత్రంతో అల్లరి నరేష్ నిరూపించబోతున్నారు. ఆయన ఒక బ్యాంక్ ఉద్యోగి అనీ, ఆ బ్యాంక్ లాకర్‌లో ఉండే బంగారు నగల చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుందనీ టీజర్ ద్వారా చెప్పకనే చెప్పారు. సస్పెన్స్, సెంటిమెంట్ అంశాలు మేళవించిన కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది.
తారాగణం:
అల్లరి నరేష్, పూజా ఝవేరి, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, పృథ్వీ, ప్రవీణ్, వెన్నెల కిశోర్, సత్యం రాజేష్, ప్రభాస్ శ్రీను, అజయ్ ఘోష్, జబర్దస్త్ మహేష్, అనంత్, భద్రం, సారిక రామచంద్రరావు.
సాంకేతిక బృందం:
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
సంగీతం: సాయికార్తీక్
సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల
ఎడిటింగ్: ఎం.ఆర్. వర్మ
ఆర్ట్: ఎన్. గాంధీ
ఫైట్స్: రియల్ సతీష్
పీఆర్వో: వంశీ-శేఖర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణకిశోర్ గరికపాటి
సహ నిర్మాత: అజయ్ సుంకర
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పి.వి. గిరి
బ్యానర్: ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్.