న‌టుడిగా నాలో మ‌రో కోణాన్ని ఆవిష్క‌రించిన చిత్ర‌మే ‘భాన‌మ‌తి రామ‌కృష్ణ‌’ - న‌వీన్ చంద్ర

06 Jul,2020

అందాల రాక్ష‌సి’ నుండి న‌టుడిగా త‌న‌ను తాను కొత్తగా ఆవిష్క‌రించుకుంటూ వ‌స్తున్న న‌వీన్ చంద్ర హీరోగా స‌లోని లూథ్రా హీరోయిన్‌గా న‌టించిన చిత్రం ‘భానుమ‌తి రామ‌కృష్ణ‌’. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్ష‌కుల‌ను దృష్టిలో పెట్టుకు ప్రారంభ‌మైన ప‌క్కా తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ‘ఆహా’. 100% తెలుగు వెబ్ సిరీస్‌, సినిమాల స్ట్రీమింగ్ యాప్‌లో ప్ర‌సారం కానున్న మ‌రో ఎగ్జ‌యిటింగ్ ప్రీమియ‌ర్ ‘భానుమ‌తి రామ‌కృష్ణ‌’. జూలై 3న ప్రీమియ‌ర్ ప్ర‌సారం కానుంది. ఈ సంద‌ర్భంగా న‌వీన్ చంద్ర ఇంట‌ర్వ్యూ....

రామ‌కృష్ణ ఎలా ఉండ‌బోతాడు?
- మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌కుడు. ఉన్న‌దాంట్లో హ్యాపీగా ఉండాల‌నుకునేవాడు. రేపు రామ‌కృష్ణ‌ను తెర‌పై చూస్తే చాలా మంది వారిని తెర‌పై చూసుకున్న‌ట్లు ఫీల్ అవుతారు. కామ‌న్ ప్రేక్ష‌కుడికి అంతగా క‌నెక్ట్ అయ్యే పాత్రే రామ‌కృష్ణ‌.
డైరెక్ట‌ర్ శ్రీకాంత్ క‌థ చెప్పిన‌ప్పుడు మీకేమ‌నిపిచింది?
- డైరెక్ట‌ర్ శ్రీకాంత్ ఫ్రెండ్ ద్వారా నాకు ప‌రిచ‌యం అయ్యాడు. త‌ను ముందు రామ‌కృష్ణ పాత్రను కాస్త బొద్దుగా, బ‌ట్ట‌త‌లతో, తెలంగాణ యాస‌తో మాట్లాడేలా ఊహించుకుని రాసుకున్నాడు. త‌ను రాసుకున్న స్క్రిప్ట్ న‌చ్చ‌డంతో త‌న‌ని డైరెక్ట్ చేయ‌మ‌ని నేనే చెప్పాను. త‌ర్వాత ఓరోజు రామ‌కృష్ణ పాత్ర‌ను నేను చేస్తాన‌ని త‌న‌తో అన్నాను. నేను అనుకున్న బ‌డ్జెట్‌కు మీకు పెద్ద హీరో అవుతారన్నాడు. క‌థ న‌చ్చింది. మీరు ఎలాంటి కొత్త ఎఫ‌ర్ట్స్ పెట్ట‌న‌క్క‌ర్లేదు అని అన్నాను. స‌రే! ఏముందిలే సుల‌భంగా చేసేయేగల‌మ‌ని అనుకుంటే .. మ‌ధ్య త‌ర‌గ‌తి రామ‌కృష్ణ‌ను తెర‌పై ఆవిష్క‌రించడానికి చాలా క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింది.

ఇప్ప‌టి వ‌ర‌కు మీరు చేసిన పాత్ర‌కు ఈ పాత్ర‌కు ఉన్న తేడా ఏంటి?
- చాలా తేడా ఉంటుందండి.. ఇంత‌కు ముందు చెప్పిన‌ట్లు అంద‌రికీ క‌నెక్ట్ అయ్యే పాత్ర రామ‌కృష్ణ‌ది. భానుమ‌తితో త‌న ప్రేమ ఎలా మొద‌లైంది?  అస‌లు ఇద్దరి మ‌న‌స్త‌త్వాల్లో ఎంత తేడా ఉంటుంది?  రెండు వేర్వేరు ఆలోచ‌న‌లున్న భానుమ‌తి, రామ‌కృష్ణ ఏ పాయింట్ ద‌గ్గ‌ర క‌నెక్ట్ అవుతారు? అనే విష‌యాలు ఓ ఎమోష‌న‌ల్ యాంగిల్‌లో ఉంటాయి. అలాగే రామ‌కృష్ణ పాత్ర‌కు 30 ఏళ్లు పైబ‌డినా పెళ్లి కాదు. అలాగే భానుమ‌తి పాత్ర కూడా ఉంటుంది. నేను చేసిన వాటిలో డిఫ‌రెంట్ ల‌వ్‌స్టోరీ విత్ డిఫ‌రెంట్ ఎమోష‌న్స్ అని చెప్ప‌గ‌ల‌ను. న‌టుడిగా సాఫ్ట్ యాంగిల్‌ను ఆవిష్క‌రించిన చిత్ర‌మిది. న‌టుడిగా బెస్ట్ రోల్ చేశాన‌నే ఫీలింగ్ ఇచ్చిన మూవీ ఇది.

సినిమా థియేట‌ర్స్‌లో విడుద‌ల కాకుండా ఓటీటీలో విడుద‌ల కావ‌డం ఎలా అనిపిస్తుంది?
- సినిమాను ప్రేక్ష‌కుడికి రీచ్ చేయించాల‌నేదే మా ఆలోచ‌న‌. అయితే ముందుగా సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాల‌నే ఆలోచ‌న‌తో చేయ‌లేదు. థియేట‌ర్స్‌లోనే విడుద‌ల చేయాల‌ని అనుకున్నాం. థియేట‌ర్‌లో జ‌నాల మ‌ధ్య కూర్చుని సినిమా చూస్తే ఆ ఫీలింగే వేరు. ఓ పండగ‌లా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు దేశంలోనే కాదు.. ప్ర‌పంచంలో నెల‌కున్న ప‌రిస్థితులు బాగోలేవు. క‌రోనా ప్ర‌భావంతో ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావ‌డానికే భ‌య‌ప‌డుతున్నారు. షూటింగ్స్ ఆగిపోయాయి. థియేట‌ర్స్ మూత‌ప‌డ్డాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో సినిమాను ప్రేక్ష‌కుల‌ను రీచ్ చేయించాలంటే ఓటీటీలే మార్గం.

లాక్‌డౌన్‌లో ఏం చేస్తున్నారు?
- క‌రోనా వ‌ల్ల బాగా ఎఫెక్ట్ అయిన రంగాల్లో సినీ ఇండ‌స్ట్రీ ఒక‌టి. ఇంకా ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ‌లేదు. ప్ర‌భుత్వాలు ప‌రిస్థితుల‌ను చ‌క్క‌బెట్ట‌డానికి కృషి చేస్తున్నాయి. ప‌రిస్థితులు నార్మ‌ల్ అయ్యేంత వ‌ర‌కు ప్ర‌జ‌లు కూడా త‌మ వంతు స‌హ‌కారాన్ని అందించాలి. లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటికే ప‌రిమిత‌మ‌య్యాను. కొత్త విష‌యాల‌ను నేర్చుకుంటున్నాను. వార్త‌ల‌ను ఫాలో అవుతున్నాను. ఇల్లు శుభ్రం చేసుకుంటున్నాను. టీవీ చూస్తున్నాను. వ‌ర్క‌వుట్స్ చేస్తున్నాను.

ఒకవైపు హీరో, మ‌రో వైపు విల‌న్‌... ఇలా డిఫ‌రెంట్ జర్నీ ఎలా అనిపిస్తుంది?
- చాలా హ్యాపీ...‘అందాల రాక్ష‌సి’తో మొద‌లైన నా ప్ర‌యాణంలో ప్ర‌తి సినిమాతో న‌టుడిగా న‌న్ను నేను మ‌లుచుకుంటూనే వ‌చ్చాను. మంచి నటుడిగా అంద‌రికీ గుర్తుండాల‌నే ఆలోచిస్తాను. అందుక‌నే హీరోగా చేస్తున్నానా?  విల‌న్‌గా చేస్తున్నానా?  అని చూడను. క‌థ ఎలా ఉంది. నా పాత్ర ఎలా ఉంది ఆలోచిస్తాను? న‌చ్చితే వెంట‌నే ఓకే చెప్పేస్తున్నాను.

త‌దుప‌రి చిత్రాలు...?
- కీర్తి సురేశ్ ‘మిస్ ఇండియా’లో కీల‌క పాత్ర చేశాను. ఆ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. ఇక రానా ‘విరాట‌ప‌ర్వం’లోనూ ఓ ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టిస్తున్నాను. ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతుంది. అలాగే వ‌రుణ్ తేజ్‌గారు బాక్స‌ర్‌గా చేస్తున్న లేటెస్ట్ మూవీలో నేను కూడా బాక్స‌ర్ పాత్ర చేస్తున్నాను. త‌మిళంలో ధ‌నుష్ ‘ప‌టాస్‌’లో మెయిన్ విల‌న్‌గా న‌టించాను. త‌ర్వాత మంచి అవ‌కాశాలే వ‌స్తున్నాయి. కాక‌పోతే ఇప్పుడు క‌థలు విన‌ప‌డానికి కుద‌ర‌డం లేదు.

 

 

Recent News