ప్రముఖ నటుడు, హిందూపురం MLA, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ భారత ఉప రాష్ట్రపతి ఎమ్. వెంకయ్య నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జులై 1 వెంకయ్య నాయుడు పుట్టినరోజు సందర్భంగా...
``అకుంఠిత కృషి, పట్టుదలతో అంచలంచెలుగా తెలుగు వారు గర్వించే నేతగా ఎదిగి నేడు భారత దేశ ఉపరాష్ట్రపతి గా సేవలందిస్తున్న శ్రీ ఎమ్. వెంకయ్యనాయుడు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను``అని నందమూరి బాలకృష్ణ అన్నారు.