*''కళాపోషకులు" టైటిల్ కాన్సెప్ట్ పోస్టర్ ను విడుదల చేసిన ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి*

06 Jul,2020

శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై విశ్వకార్తికేయ, దీప ఉమావతి హీరో హీరోయిన్స్ గా తెరకెక్కబోతున్న సినిమా కళాపోషకులు. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతోంది. లవ్ స్టోరీతో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉండబోతున్నాయి. ఆ నలుగురు చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన విశ్వకార్తికేయ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవ్వడం విశేషం. 

"కళాపోషకులు'' దర్శకుడు చలపతి పువ్వుల దర్శకత్వం వహించిన "అప్పుడు ఇప్పుడు" చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. మహావీర్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు అలరించే విధంగా ఉండబోతొంది.

బ్యానర్: శ్రీ వెన్నెల క్రియేషన్స్

నటీనటులు: విశ్వకార్తికేయ, దీప ఉమాపతి, భాష, చైతన్య, చిన్ను 

కెమెరామెన్: కళ్యాణ్ సమి

ఎడిటర్: సెల్వ కుమార్

సంగీతం: ఎలేందర్ మహావీర్ డిజైన్: గణేష్

పీఆర్ఓ: సాయి సతీష్

నిర్మాత, స్టొరీ: సుధాకర్ రెడ్డి.ఎమ్

స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: చలపతి పువ్వుల

 

Recent News