నిఖిల్, చందు మెుండేటి ల కాంబినేషన్ లో మ్యాజిక్ రిపీట్:
24 అక్టోబర్ 2014 సంవత్సరం కొత్త కాన్సెప్ట్ చిత్రాలతో యూత్ ఐకాన్ గా నిఖిల్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంటున్న సమయం లో కార్తికేయ అనే ప్రతిష్టాత్మక థ్రిల్లర్ విడుదలయ్యి సంచలన విజయాన్ని సోంతం చేసకుంది. ఆ తరువాత నిఖిల్ ఎన్ని చిత్రాలు చేసినా ఎన్ని బ్లాక్‌బస్టర్స్ చేసినా కూడా కార్తికేయ క్రేజ్ వేరనే చెప్పాలి. సోషల్ మీడియాలో కార్తికేయ సీక్వెల్ ఎప్పుడు అని ఇటు నిఖిల్ ని, అటు దర్శకుడు చందు మెుండేటి ని కామెంట్ చెయ్యని నెటిజన్స్ లేరనే చెప్పాలి. అంతలా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఎనిమల్ హిప్నటిజం అనే కొత్త కాన్సెప్ట్ ని ఆ చిత్రం ద్వారా తెలుగుకి పరిచయం చేశారు. ఇన్నాళ్ళకి మళ్ళి వీరిద్దరి కాంబినేషన్ లో చిత్రం అది కూడా కార్తికేయ2 గా రావటం యావత్ తెలుగు సిని ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేవు.. ఈ చిత్రాన్ని మార్చి2 న తిరుమల తిరుపతి లో పూజాకార్యక్రమాలు జరుపుకుంటుంది. శ్రీ వెంకటేశ్వరస్వామి సన్నిధానం లో పూజాకార్యక్రమాలతో ప్రారంభం కావటం యూనిట్ సభ్యులు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరి & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మాణం లో బ్లాకబస్టర్ కాంబినేషన్:
మంచి చిత్రాలు కమర్షియల్ విలువల తో నిర్మాణాన్ని కొనసాగిస్తున్న క్రేజి నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్. ఈ రెండు నిర్మాణ సంస్థలు విడివిడిగా ఎన్నో సూపర్‌హిట్స్ అందించారు. అలాగే కలిసి బ్లాక్‌బస్టర్ హిట్స్ అందించారు. ఇప్పుడు మరోక్కసారి బ్లాకబస్టర్ స్టోరి ని నిఖిల్, చందుమెండేటి క్రేజి కాంబినేషన్ లో మార్చి2న తిరుమల తిరుపతి లో పూజాకార్యక్రమాలు జరుపుకుని ప్రారంభం అవుతుంది. సినిమా అంటే కమర్షియల్ చిత్రాలే కాదు ప్రేక్షకుడ్ని అలరించే విధంగా వుండాలి అనే ఫ్యాషన్ తో చిత్రాలు నిర్మించి తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర నిర్మాత గా పేరుగాంచిన టి.జి విశ్వప్రసాద్ గారు , ప్రేక్షకుడి నాడి ని జడ్జ్ చేసి వారిని అలరించే చిత్రాలు నిర్మించి టాలీవుడ్ లో క్రేజి ప్రోడ్యసర్ గా పేరుగాంచిన అభిషేక్ అగర్వాల్ లు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
2020 లో కార్తికేయ2 విడుదల :