'ఎఫ్2', 'వెంకీమామ' వంటి వరుస బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో దూసుకెళ్తోన్న విక్టరీ వెంకటేష్ 74వ చిత్రం 'నారప్ప' షూటింగ్ అనంతపురం జిల్లా ఉరవకొండలోని పాల్తూరు గ్రామంలో ప్రారంభమైంది. తమిళ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా సంచలనం సృష్టించిన 'అసురన్' చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి, వి క్రియేషన్స్ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం తమిళ నాడు లోని కురుమలై లో ప్రముఖ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ నేతృత్వంలో 'నారప్ప' కి సంబంధించి కీలక యాక్షన్ సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. ఈ సన్నివేశాల చిత్రీకరణ పూర్తయ్యాక విక్టరీ వెంకటేష్, చిత్ర బృందం అనంతపురం లో షెడ్యూల్ కంటిన్యూ చేస్తారు. సమ్మర్ కి రిలీజ్ ప్లాన్ చేశారు.
విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సామ్.కె నాయుడు, సంగీతం: మణిశర్మ, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్: గాంధీ నడికుడికర్, కథ: వెట్రిమారన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, విజయ్, లిరిక్స్: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, అనంతశ్రీరామ్, కృష్ణకాంత్, కాసర్ల శ్యాం, ఫైనాన్స్ కంట్రోలర్: జి.రమేష్‌రెడ్డి, ప్రొడక్షన్ కంట్రోలర్: రామబాలాజి డి., ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఏపీ పాల్ పండి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ శంకర్, కో- ప్రొడ్యూసర్: దేవిశ్రీదేవి సతీష్, నిర్మాతలు: డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్. థాను, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల