నేను ఈ స్థాయిలో ఉండ‌టానికి కార‌ణ‌మైన ప్రేక్ష‌కులంద‌రూ కామ్రేడ్సే - `డియ‌ర్ కామ్రేడ్` ట్రైల‌ర్ వేడుక‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌

11 Jul,2019

నేను ఈ స్థాయిలో ఉండ‌టానికి కార‌ణ‌మైన ప్రేక్ష‌కులంద‌రూ కామ్రేడ్సే  - `డియ‌ర్ కామ్రేడ్` ట్రైల‌ర్ వేడుక‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా నటిస్తున్న చిత్రం `డియ‌ర్ కామ్రేడ్‌`. `ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్‌` అనేది ట్యాగ్ లైన్‌.  భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.ఎం), య‌ష్ రంగినేని సంయుక్త‌గా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం గురువారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ట్రైల‌ర్‌ని విడుద‌ల చేశారు. 

ఈ సంద‌ర్భంగా విజ‌య్ దేవ‌ర‌కొండ మాట్లాడుతూ ``ఈ రోజు నాలుగు భాష‌ల్లో ట్రైల‌ర్ విడుద‌ల అయ్యంది. అలాగే ఈ నెల 26న తెలుగుతోపాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌లో సినిమా విడుద‌ల కానుంది. ట్రైల‌ర్ కోసం ఉదయాన్నే నిద్ర‌లేచా. చాలా టెన్ష‌న్‌గా ఉండింది. ట్రైల‌ర్ ఎలా వ‌చ్చిందో అని. సినిమా విడుద‌ల‌వుతుందంటే గ‌త కొన్ని రోజులుగా నిద్ర‌ప‌ట్ట‌డం లేదు. ట్రైల‌ర్ అంద‌రికి న‌చ్చింద‌నుకుంటున్నా. ఈ చిత్రానికి సంబంధించి మ్యూజిక‌ల్ ఫెస్ట్ నిర్వ‌హించ‌బోతున్నాం. ఈ నెల 12న బెంగుళూరులో, 13న కొచ్చిలో, 18న చెన్నైలో, 19న హైద‌రాబాద్‌లో మ్యూజిక‌ల్ ఫెస్టివ‌ల్ నిర్వ‌హించ‌నున్నాం. మ్యూజిక్ డైరెక్ట‌ర్ జ‌స్టిన్ ప్ర‌భాక‌ర్ బెస్ట్ ఆల్బ‌మ్ ఇచ్చారు. సినిమా కోసం టీమంతా ఎంతో క‌ష్ట‌ప‌డ్డాం. మంచి ఔట్‌పుట్ వ‌చ్చింద‌ని భావిస్తున్నాం. క‌చ్చితంగా సినిమా ఆకట్టుకుంటుంది. ఇక ఎంజాయ్ చేయాల‌ని నిర్ణ‌యించాం. అందుకే మంచి మ్యూజిక్‌ని ఆడియెన్స్ తో క‌లిసి సెలబ్రేట్ చేయ‌బోతున్నాం. ఈ సెల‌బ్రేష‌న్‌ గ్రాండ్‌గా ఉండ‌బోతుంది. అందుకోసం ప్రాప‌ర్‌గా రిహార్స‌ల్ చేస్తున్నాం. కామ్రేడ్ అంటే మ‌నం ఏ ప‌ని చేసినా, క‌ష్ట‌సుఖాల్లో మ‌న‌కు తోడుగా ఉండే వ్య‌క్తుల్ని, స్నేహితుల‌ను కామ్రేడ్ అంటాం. నేను ఈ స్థాయిలో ఉండ‌టానికి కార‌ణం ఆడియెన్స్ అభిమానం, ప్రేమ‌, స‌పోర్ట్. వాళ్ళంతా కామ్రేడ్సే. అందుకే వారికోసం మ్యూజిక్ సెలబ్రేష‌న్ నిర్వ‌హించాలనుకుంటున్నాం. అంద‌రూ ఫ్రీగా ఈ ఈవెంట్స్‌కి రావ‌చ్చు. బెంగుళూరులో జ‌రిగే ఈవెంట్‌కి రాకింగ్ స్టార్ య‌శ్ గెస్ట్‌గా హాజ‌రు కానున్నారు. ఆయ‌న‌కు థ్యాంక్స్`` అని అన్నారు. 

ర‌ష్మిక మంద‌న్నా మాట్లాడుతూ ``ఇదొక బ్యూటిఫుల్ స్టోరీ. ఇందులో లిల్లీ పాత్ర‌లో క‌నిపిస్తాను. సినిమా అయ్యాక అంద‌రూ బిజీగా గ‌డుపుతున్నారు. నేను కూడా వారి మాదిరిగానే బిజీగా ఉండాల‌నుకుంటున్నా, కానీ కుద‌ర‌డం లేదు. ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ ఈ సినిమాతో బిజీ అవ‌డ‌మే కాదు, పెద్ద ద‌ర్శ‌కుడ‌వుతాడు. ప‌ది నిమిషాల స‌న్నివేశాల కోసం మూడు, నాలుగు నెల‌లు క్రికెట్ నేర్చుకోవాల్సి వ‌చ్చింది. అలాగే సెట్‌లో న‌న్ను 20 రోజుల‌పాటు ఏడిపించారు. డ‌బ్బింగ్ చెప్ప‌డానికి నాలుగు నెలలు ప‌ట్టింది. సినిమా చాలా బాగా వ‌చ్చింది. వండ‌ర్‌ఫుల్ టీమ్‌తో ప‌నిచేసినందుకు చాలా హ్యాపీగా ఉంది`` అని చెప్పారు. 

చిత్ర ద‌ర్శ‌కుడు భ‌రత్ క‌మ్మ మాట్లాడుతూ ``దొక లాంగ్ జ‌ర్నీ. మూడేండ్లుగా దీనిపై వ‌ర్క్ చేస్తున్నాం.  స‌పోర్ట్ చేసిన విజ‌య్‌కి థ్యాంక్స్. సినిమా ఇంత బాగా రావ‌డానికి కార‌ణ‌మైన మైత్రీమూవీస్ నిర్మాత‌ల‌కు, య‌శ్ రంగినేనిగారికి ధ‌న్య‌వాదాలు.సినిమా బాగా వ‌చ్చింది. నేను మాట్లాడ‌టం కంటే సినిమానే మాట్లాడుతుంద‌నుకుంటున్నాను`` అని అన్నారు. 

నిర్మాత య‌శ్ రంగినేని చెబుతూ ``ఈ సినిమా ద్వారా ఓ కొత్త విజ‌య్‌ని చూస్తారు. గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్న‌మైన పాత్ర‌లో క‌నిపిస్తారు.  సినిమాలో భాగ‌మైన మైత్రీ మూవీ మేక‌ర్స్ కి థ్యాంక్స్`` అని చెప్పారు.

నిర్మాత న‌వీన్ యెర్నీని మాట్లాడుతూ ``ట్రైల‌ర్ అత్య‌ద్భుతంగా వ‌చ్చింది. అన్ని వ‌ర్గాల‌నుంచి మంచి స్పంద‌న ల‌భిస్తుంది. శుక్ర‌వారం నుంచి మ్యూజిక్ ఫెస్టివ‌ల్ నిర్వ‌హించాలని నిర్ణ‌యించాం. ఈ నెల 22న వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించ‌నున్నాం. ఈవెంట్‌ని, 26న విడుద‌ల‌య్యే సినిమాని గ్రాండ్ స‌క్సెస్ చేయాల‌ని కోరుకుంటున్నాను`` అని అన్నారు.

ఈ కార్యక్ర‌మంలో మ‌రో నిర్మాత ర‌విశంక‌ర్‌, చెర్రీ త‌దిత‌రులు పాల్గొన్నారు.

సాంకేతిక నిపుణులు:
క‌థ‌, స్క్రీన్‌ప్లే, దర్శ‌క‌త్వం:  భ‌ర‌త్ క‌మ్మ‌
బ్యాన‌ర్స్‌:  మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్‌
నిర్మాత‌లు:  న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.ఎం), య‌ష్ రంగినేని
సి.ఇ.ఒ:  చెర్రీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  వై.అనీల్‌
మ్యూజిక్‌:  జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ:  సుజిత్ సారంగ్
ఎడిటింగ్ & డి.ఐ: శ‌్రీజిత్ సారంగ్‌
డైలాగ్స్‌:  జె కృష్ణ‌
ఆర్ట్ డైరెక్ట‌ర్‌:  రామాంజ‌నేయులు
సాహిత్యం:  చైత‌న్య ప్ర‌సాద్‌, రహ‌మాన్‌, కృష్ణ‌కాంత్‌
కొరియోగ్రాఫర్‌:  దినేష్ మాస్ట‌ర్‌
కాస్ట్యూమ్ డిజైన‌ర్‌:  అశ్వంత్ బైరి, ర‌జ‌ని
యాక్ష‌న్ డైరెక్ట‌ర్‌:  జి.ముర‌ళి
ప‌బ్లిసిటీ డిజైన్‌:  అనీల్, భాను
పి.ఆర్‌.ఒ: వ‌ంశీ శేఖ‌ర్‌
 

Recent News