"నన్ను దొచుకుందువటే" తో తెలుగు ఆడియన్స్ ని తన యాక్టింగ్ టాలెంట్ తో
ఫిదా చేసిన నభా ఇస్మార్ట్ కి లైన్ మార్చి పూర్తి కమర్షియల్ హీరోయిన్ గా
మారిపోయింది. ట్రెండింగ్ లో దుమ్ములేపుతున్న ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్ లో
హీరో తర్వాత నభా డైలాగ్ మోస్ట్ పాపులర్ అయ్యింది. మాస్ రోల్ లో
కనిపిస్తున్న నభా ‘వరంగల్ పోరళ్ల ’ నే కాదు రెండు రాష్ట్రాల తెలుగు
కుర్రాళ్ళను ఎట్రాక్ట్ చేసింది.
తెలుగు లో మాట్లాడటం.. యాక్టివ్ గా ప్రమోషన్స్ లో కనపడటం నభాకి
అడ్వాంటేజ్ గా మారాయి. వరంగల్ బోనాల్ ఈవెంట్ లో నభా మాటలు ఎనర్జీ ని
క్రియేట్ చేసాయి ‘ రోమాన్స్ లో యాక్షన్ ఉంది’లాంటి మాటలు సోషల్ మీడియాలో
వైరల్ అవుతున్నాయి.ఆమె స్పీచ్ యూట్యూబ్ లో నెంబర్ 2 ప్లేస్ లో ట్రెండింగ్
కావడం విశేషం.ఓ పరభాష హీరోయిన్ తన రెండో సినిమాతోనే తెలుగు లో
మాట్లాడినందుకు అభినందిస్తున్నారు నెటిజన్లు.అందుకే ఆ స్పీచ్ కు ఫిదా
అయిపోయారు.
పూరి జగన్నాథ్ సినిమాలలో ఉండే అగ్రిసెవ్ నెస్ ని పూర్తిగా అడాప్ట్
చేసుకొని తనను కొత్త గా ప్రజెంట్ చేసుకొన్న నభా ఇప్పుడు యూత్ కి హార్ట్
త్రోబ్ గా మారింది. దిమ్మాక్ కరాబ్ సాంగ్ లో నభా ఎక్స్ ప్రెషన్స్ అండ్
డాన్స్ స్టెప్పులు అదిరిపోతాయాయట టాక్ యూనిట్ లో వినిపిస్తుంది. మోస్ట
ఎనర్జిటిక్ అండ్ టాలెంటెడ్ గాళ్ గా నభా తెలుగు హీరోయిన్స్ లో కొత్త గా
కనిపిస్తుంది. థియేటర్స్ బ్యాక్ డ్రాప్ నుండి వచ్చిన నభా లోని ఎనర్జీకీ,
యాక్టింగ్ టాలెంట్ కి దర్శకుడు పూరి కూడా బాగా ఇంప్రెస్ అయ్యారు.
ఇస్మార్ట్ శంకర్ లో మాగ్జిమమ్ స్కోర్ చేయబోతున్న నభా టాలీవుడ్ ట్రెండీ
హీరోయిన్స్ సరసన నిలుస్తుందనడంలో సందేహం లేదంటున్నారు ఫిల్మ్ నగర్ జనాలు.