`ఇస్మార్ట్ శంక‌ర్` బోనాలు కార్య‌క్ర‌మం

08 Jul,2019

`ఇస్మార్ట్ శంక‌ర్` బోనాలు కార్య‌క్ర‌మం

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేశ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం `ఇస్మార్ట్ శంకర్‌`. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కుడు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.   జూలై 18న సినిమా విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా వ‌రంగ‌ల్‌లో బోనాలు కార్య‌క్ర‌మాన్ని చిత్ర యూనిట్ నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా...


ఎన‌ర్జిటిక్ హీరో రామ్ మాట్లాడుతూ - ``ఏం మాట్లాడాలో కూడా అర్థం కావ‌డం లేదు. బోనాలు పండుగ‌కి వ‌రంగ‌ల్ రావ‌డం ఇక్క‌డ సెల‌బ్రేట్ చేసుకోవ‌డం... అదే స‌మ‌యంలో మ‌న సినిమాలో కూడా బోనాలు పాట ఉండ‌టం ఆనందంగా ఉంది. మణిశ‌ర్మ‌గారు అద్భుత‌మైన మ్యూజిక్ ఇచ్చారు. సాధారణంగా సినిమాలో ఒక‌టో, రెండో సాంగ్స్ బావుంటాయి. కానీ సినిమాలో ప్ర‌తిసాంగ్ బావుంది. తెలంగాణ క్యారెక్ట‌ర్ చేయ‌డం అంత సుల‌భం కాదు. న‌భా న‌టేశ్ చాలా బాగా చేసింది. వ‌రంగ‌ల్ కాలేజ్ కుర్రాళ్ల మీద కూడా ఓ కౌంట‌రేసింది. నిధి అగ‌ర్వాల్ సోఫెస్టికేటెడ్ సైంటిస్ట్ పాత్ర‌లో న‌టించింది. ఇక ఉండిపో సాంగ్‌లో త‌న విశ్వ‌రూపం చూస్తారు. బోనాలు సాంగ్‌ను శిరీష్ కంపోజ్ చేశాడు. అలాగే క‌థ‌తో పాటు మూవ్ అయ్యే ఫైట్స్ 8 ఉన్నాయి. వాటిని స‌తీష్ కంపోజ్ చేశాడు. రాజ్‌తోట‌గారు అద్భుత‌మైన సినిమాటోగ్ర‌ఫీ అందించారు. ఛార్మిసినిమా వ్య‌వ‌హారాల‌ను ప‌ర్య‌వేక్షించింది. దీంతో ప‌నిపైనే కాన్‌స‌న్‌ట్రేట్ చేస్తే స‌రిపోతుంద‌నిపించేలా త‌ను అంద‌రినీ చూసుకుంది. ఇక పూరిగారి గురించి చెప్పాలంటే.. ఏ సినిమా చేయాలో ఆలోచించుకుంటూ నేను విదేశాల‌కు వెళ్లిపోయాను.  డ్యాన్సులు, ఫైట్స్‌, లుక్స్ స‌హా అన్ని ఉండి కొత్త‌గా ఉండాల‌ని అంద‌రూ కోరుకుంటున్నార‌ని తెలిసింది. ఆ స‌మ‌యంలో పూరిగారిని క‌లిసిన‌ప్పుడు `ఇస్మార్ట్ శంక‌ర్‌` ఐడియా వ‌చ్చింది. బేసిక్ పాయింటే కొత్త‌గా ఉంటుంది. ఫ‌స్ట్ టైమ్ సైఫై మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌తో వ‌స్తున్నాం. చాలా ఎగ్జ‌యిటెడ్‌గా ఉన్నాను. పూరిగారితో ఓ మాట చెప్పాల‌నుకుంటున్నాను `మీతో ప‌నిచేస్తున్న‌ప్పుడు దీనెమ్మ ఉన్న కిక్కే వేరండి`. చివ‌రిరోజు షూటింగ్ వెళితే పూర్త‌యిపోతుంది. వెళ్లాలా వ‌ద్దా? అని ఆలోచించుకుంటూ వెళ్లాను. జూలై 12న అంద‌రూ సినిమా చూడండి`` అన్నారు. 
 

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ మాట్లాడుతూ - ``హైద‌రాబాద్ ఇస్మార్ట్ రౌడీకి పోలీసోళ్లు డిప్ప‌లో బొక్క‌బెట్టి, చిప్ప‌లోకి సిమ్‌కార్డ్ పెట్టిండ్రు`అదెందుకు పెట్టారు?  పెట్టిన త‌ర్వాత ఏమైంద‌నేదే స్టోరి. చాలా ఎంట‌ర్‌టైనింగ్ స్టోరి. రామ్‌నే ఈ సినిమాకు హైలైట్‌. నాకు టెంప‌ర్ సినిమా త‌ర్వాత మంచి హిట్ ప‌డ‌లేదు. విప‌రీత‌మైన ఆక‌లితో ఉంటే నాకు రామ్ దొరికాడు. వెజిటేరియ‌న్ ముసుగులో ఉన్న నాన్ వెజిటేరియ‌న్ కుర్రాడు రామ్‌. నేను త‌న‌నేం మార్చ‌లేదు. త‌న‌లో ఉండే గుణం. త‌ను  రామ్ పోతినేని కాదు.. రామ్‌చిరుత‌పులి. సినిమా త‌ప్ప మ‌రోటి ఉండ‌దు. ఇళ్లు త‌ర్వాత షూటింగే. ప్ర‌తిషాట్‌ను వంద‌శాతం మ‌న‌సుపెట్టి చేస్తాడు. త‌న‌కు హ్యాట్సాఫ్‌. మ‌ణిశ‌ర్మ‌గారు ఐదు మంచి పాట‌ల‌ను ఇచ్చారు. అన్ని పాట‌లు పెద్ద హిట్ అయ్యాయి. బోనాలు టైమ్‌లోనే మా సినిమా రిలీజ్ కావ‌డం.. అందులో బోనాలు సాంగ్ ఉండ‌టం యాదృచ్చికం. నిధి అగ‌ర్వాల్ చాలా హాట్‌. న‌భా చాలా మంచి రోల్‌. బాగా పెర్ఫామెన్స్ చేసింది. ఛార్మి ప్లానింగ్ బావుంటుంది. ఏ రోజూ ఏ ఇబ్బందీ లేకుండా షూటింగ్ పూర్తి చేశాం. ఆ క్రెడిట్ అంతా ఛార్మికే ద‌క్కుతుంది. స‌త్య‌దేవ్ చాలా ఇంపార్టెంట్ రోల్ చేశాడు. ప్రేక్ష‌కుల ఆశీర్వాదంతో ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి.. డ‌బుల్ ఇస్మార్ట్ సినిమా తీయాలి. అంత‌కు మించి కోరిక‌లేం లేవు`` అన్నారు.  
 

ఛార్మి మాట్లాడుతూ - ```ఇస్మార్ట్ శంక‌ర్‌` జూలై 18న విడుద‌ల‌కానుంది. రామ్‌గారి ఎన‌ర్జీ ల‌వ్‌, యాక్ష‌న్ స‌న్నివేశాలు, నిధి, న‌భా న‌టేశ్‌, లేఖ న‌ట‌న‌ను థియేట‌ర్‌ను చూడాలి. స్టార్టింగ్ నుండి చివ‌రి వ‌ర‌కు ఎంజాయ్ చేస్తారు. ప్రేక్ష‌కుల కోసం చేసిన కంప్లీట్ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌. మా టీమ్‌లో ప్ర‌తి ఒక్క‌రికీ థాంక్స్‌. పూరి సార్‌!.. అద్భుత‌మైన డైలాగ్స్ రాశారు`` అన్నారు. 
 

న‌భా న‌టేశ్ మాట్లాడుతూ - ``నేను వరంగ‌ల్‌కు రావ‌డం ఇది రెండోసారి. ఈ సినిమాకు ప‌నిచేయడాన్ని ఎంజాయ్ చేశాను. ఒక మంచి పాత్ర రాసి, దాన్ని నాపై న‌మ్మ‌కంతో నాకు ఇచ్చినందుకు పూరిగారికి థాంక్స్‌. రామ్ స్వీటెస్ట్ కో్స్టార్‌. నిధి అగ‌ర్వాల్‌కు థాంక్స్‌. డైరెక్ష‌న్, ప్రొడ‌క్ష‌న్ టీంల‌కు థాంక్స్‌. రాజ్‌తోట‌గారు చాలా మంచి విజువ‌ల్స ఇచ్చారు. 
 

నిధి అగ‌ర్వాల్ మాట్లాడుతూ - ``నేను రెండోసారి వరంగ‌ల్‌కు వచ్చాను. రామ్‌, పూరిగారితో క‌లిసి వ‌ర్క్ చేయ‌డం ఆనందంగా ఉంది. న‌భా చాలా మంచి పాత్ర‌లో న‌టించింది. రాజ్‌గారికి, మ‌ణిశ‌ర్మ‌గారికి థాంక్స్‌. రామ్‌తో డ్యాన్స్ చేయ‌డం చాలా క‌ష్టం. దిమాక్ ఖ‌రాబ్ అయ్యాడు. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.

Recent News