రామా రీల్స్ బ్యానర్‌పై జాన్ సుధీర్ పూదోట నిర్మాతగా విష్ణు, సురభి జంటగా జి.ఎస్.కార్తీక్ దర్శకత్వం వహించిన 'ఓటర్' చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. అనేక అడ్డంకులు ఎదుర్కొన్న ఈ చిత్రం మీద ఆడియన్స్‌లోనూ, ట్రేడ్ వర్గాల్లోనూ మంచి క్రేజ్ ఏర్పడింది. అందుకే సార్థక్ మూవీస్ సంస్థ పోటీపడి మరీ ఫ్యాన్సీ రేటుకి విడుదల హక్కులను సొంతం చేసుకుంది. ఈ నెల 21న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుందీ సినిమా. నిర్మాత మాట్లాడుతూ ''పదవిలో ఉన్న నాయకుడు సరిగా పనిచేయకపోతే.. అతనితో ఎలా పనులు చేయించుకోవాలో తెలిపే నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఓటు హక్కు, ఓటర్ విలువను తెలిపే ఈ చిత్రాన్ని పొలిటికల్ డ్రామాగా దర్శకుడు కార్తీక్ చక్కగా తెరకెక్కించారు. చక్కని సందేశంతోపాటు, పోరాట సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన సార్థక్ మూవీస్ సంస్థ మా సినిమాను విడుదల చేయడం ఆనందంగా ఉంది'' అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: రాజేష్ యాదవ్, ఎడిటింగ్: కె.ఎల్ ప్రవీణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కిరణ్ తనమాల.