సింగర్ సునీత అంటే తెలియని వారు లేరు. గులాబీ మూవీతో ఈ వేళలో ఏం చేస్తూంటావో అంటూ తన మధురమైన గొంతుతో అద్భుతంగా మనలని వెంటాడుతూనే ఉంటుంది. ఇక మాఘమాసం ఎపుడొస్తుందో అంటూ ఎగిరే పావురమాలో ఆమె పాడిన హుషారైన సాంగ్ చప్పున గుర్తుకువస్తుంది. ఇక సునీత ఎన్నో పాటలు పాడి తెలుగు శ్రోతల గుండెల్లో మంచి ప్లేస్ సంపాదించుకున్నారు.
తాజాగా సునీత విశాఖ శారదాపీఠం శ్రీ స్వరూపానందేంద్ర స్వామీజీపై ఫైర్ అయ్యారు. స్వరూపానందేంద్ర సరస్వతి లాంటి ప్రముఖ వ్యక్తి తన వద్దకు వచ్చిన భక్తుల జాబితాలో నా పేరు చేర్చడం ఆశ్చర్యంగా ఉంది. అది కూడా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో... ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలనే ట్విట్టర్ లో ఈ పోస్టు పెడుతున్నాను, నేను అతడిని కలవక పోయినా ఎందుకు ఇలా చెబుతున్నారో తెలియదు' అంటూ సునీత వ్యాఖ్యానించారు
సినిమా ప్రముఖులు అంతా తన దగ్గరకు వస్తూంటారని స్వామీజీ ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ సందర్భంగా సునీత పేరు కూడా అయన చెబుతూ ఆమె కూడా తనను కలవడానికి వస్తారని అనడం సునీతకు కోపం తెప్పించింది. కాగా సోషల్ మీడియాలో దీని మీద సునీత ట్వీట్ చేయగా రెస్పాన్స్ కూడా బాగా వచ్చింది. అయితే కొందరు మాత్రం స్వామీజీ ఒక పేరు చెప్పబోయి పొరపాటున సునీత పేరు చెప్పి ఉంటారని, ఇందులో పెద్ద విషయం ఏమీ లేదని తేల్చేస్తున్నారు.