సప్తగిరి, వైభవి జోషి జంటగా నటించిన సినిమా `వజ్రకవచధరగోవింద`. అరుణ్ పవార్ దర్శకుడు. శివ శివమ్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. బేబీ శాస్త్ర సమర్పిస్తున్నారు. నరేంద్ర యడల, జీవీయన్ రెడ్డి నిర్మించారు. బ్రహ్మయ్య విడుదల చేస్తున్నారు.ఈ నెల 14న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో `వజ్రకవచధర గోవింద` చిత్ర యూనిట్ ప్రెస్‌మీట్ ను నిర్వహించింది.
సప్తగిరి మాట్లాడుతూ ``నా సినిమా విడుదల తేదీ దగ్గరపడింది. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. నా గత చిత్రాల్లాగే ఈ సినిమా కూడా పెద్ద హిట్ కావాలి. టీమ్ అందరం కష్టపడి పనిచేశాం. నిర్మాతలు మంచి సపోర్ట్ ఇచ్చారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరూ తమ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. హీరోయిన్ ప్రాణాలకు తెగించి మరీ బెలూన్ కేవ్స్ సీన్‌లో నటించింది. ఈ సినిమాకు శ్రీకాంత్‌గారు వాయిస్ ఓవర్ ఇచ్చి ప్రాణం పోశారు. ఆయనకు ధన్యవాదాలు`` అని అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ ``మా సినిమా రెండు రోజుల్లో విడుదల కానుంది. సినిమాను అందరూ పెద్ద హిట్ చేస్తారని ఆశిస్తున్నాను. సప్తగిరి ఈ సినిమాకు చాలా సపోర్ట్ చేశారు`` అని చెప్పారు.
దర్శకుడు మాట్లాడుతూ ``సినిమా చాలా బాగా వచ్చింది. మా నిర్మాతలు లేకపోతే ఈ సినిమా లేదు. చాలా బాగా సపోర్ట్ చేశారు. సినిమా విడుదలవుతుంటే ఎగ్జయిటింగ్‌గా ఉంది. సినిమా మీద అంత కాన్ఫిడెన్స్ ఉంది. 70-80 శాతం కామెడీ ఉంటుంది. స్క్రీన్ ప్లే కూడా బావుంది. ఉత్కంఠగా సాగే సన్నివేశాలుంటాయి. యాక్షన్‌లోనూ కామెడీ ఉంటుంది. క్లైమాక్స్ బావుంటుంది. ఆకలి మీదున్న సింహంలాగా మా సినిమా ఉంది`` అని చెప్పారు.
వైభవి జోషి మాట్లాడుతూ ``ఈ సినిమాలో కామెడీ చాలా ఉంటుంది. మా కుటుంబసభ్యులకు తెలుగు రాకపోయినా కూడా పడీ పడీ నవ్వారు. సినిమా తప్పకుండా పైసా వసూల్ మూవీ అవుతుంది`` అని అన్నారు.
ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పలువురు పాల్గొన్నారు.