శివశివమ్ ఫిల్మ్స్ బ్యానర్ పై బేబీసహస్రా సమర్పిస్తున్న చిత్రం వజ్రకవచధార గోవింద. అరుణ్‌పవార్ దర్శకత్వంలో నరేంద్ర ఎడ్లా, జివిఎన్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సప్తగిరి, వైభవిజ్యోషి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవుడికి సప్తగిరికి మధ్య నడిచే చిన్న కథ ఇది. షూటింగ్ పనులు మొత్తం పూర్తిచేసుకుని జూన్ 14న విడుదల కానుంది, ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో...
డిస్ర్టిబ్యూటర్ బ్రహ్మమ్ మాట్లాడుతూ... నేను రాయలసీమలో 32ఏళ్ళుగా డిస్ర్టిబ్యూటర్‌గా ఉన్నాను. ఈ సినిమా చూసి నచ్చి సీడెడ్ రైట్స్‌ను కొనదాం అనుకున్నా. సింగిల్ పేమెంట్‌లో నేను ఈ సినిమాను కొనడం జరిగింది. నాకు ఆ భగవంతుడు ఆ సంకల్పాన్ని కలిగించి ఈ 14వ తేదీన రిలీజ్ అయ్యేలా చేశాం. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన సప్తగిరిగారికి అందరికీ నా కృతజ్ఞతాభివందనములు అన్నారు.
పొడ్యూసర్ మాట్లాడుతూ... జూన్ 14న మీముందుకు వస్తున్నాం అందరూ ఆశీర్వదించండి. ఒక ఊరి ప్రజలను ఏ విధంగా కాపాడాడు అన్నదే కథ. మమ్మల్ని ఇంత దూరం నడిపించిన సప్తగిరిగారికి చాలా థ్యాంక్స్. ఈ చిత్రంలో నటించిన ప్రతి ఆర్టిస్ట్‌కి పేరు పేరున నా ప్రత్యేక కృతజ్ఞతలు. మా ప్రాణం పెట్టి ఈ సినిమా తీశాం. సప్తగిరిగారు లేకపోతే మేము ఇక్కడ లేము. ఎప్పుడూ ఎల్లవేళలా నా వెంట ఉంటూ నరేంద్రన్న నడిపిస్తూ ఉన్నారు. జూన్ 14న మా నరేద్రన్న పుట్టిన రోజు నాడు ఈ చిత్రం విడుదలవ్వడం చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని మార్కెట్‌కి పరిచయం చేసిన బ్రహ్మం గారికి కూడా చాలా థ్యాంక్స్. మీరందరూ సినిమాని చూసి తప్పకుండా ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ... జూన్ 14న విడుదల కోబోతుంది. ఈ సినిమాని చాలా బాగా తీశాం. చాలా బాగా వచ్చింది. ఈ సినిమాలో చాలా మంచి కమెడియన్స్ ఉన్నారు. నాకు మాట్లాడే ప్లాట్‌ఫామ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్నారు. నాకు ప్రొడ్యూసర్‌గారు ఒక నమ్మకాన్ని ఇచ్చారు. ఎంత బడ్జెట్ అయినా పర్వాలేదు అన్నారు. ఒక రెయిన్ సాంగ్‌ని ఒరిజినల్ రెయిన్‌లో మంచి ఎమోషన్‌తో సీన్‌ని తీశాం. మనం వెళ్ళే మార్గం మంచి దారిని ఎంచుకుంటే అంతా సక్సెస్ వైపే వెళుతుంది. మా సినిమాని అన్ని వర్గాలకు నచ్చేలా తీశాం. అని అన్నారు.
సప్తగిరి మాట్లాడుతూ... ఇది చాలా చిన్న బడ్జెట్ సినిమా కాని దీనికి బయట మంచి రెస్పాన్స్ వస్తుంది. సప్తగిరిఎక్స్‌ప్రెస్, సప్తగిరిఎల్ ఎల్‌బి , ఒకటి హిట్ అయింది. ఒకటి మంచి పేరును తీసుకొచ్చింది. ఈ సినిమా నాకు పేరు, డబ్బులు రెండూ తీసుకురావాలని కోరుకుంటున్నాను. అప్పారావ్, అవినాష్ ఇందులో చాలా మంచి పాత్రల్లో నటించారు. చాలా థ్యాంక్స్ అన్నారు. 14న విడుదలవుతున్న మా సినిమాని చూసి మీరందరూ తప్పకుండా ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.