ప్రొడ్యూసర్ మంజునాధ్ మాట్లాడుతూ... ఇటీవలె విడుదలైన టీజర్ మరియు పాటలు చాలా పెద్ద హిట్ అయి అద్భుతమైన స్పందన దక్కించుకుంది. ఈ చిత్రం 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మీరందరూ తప్పకుండా ఆదరించాలని అన్నారు.
ఐ.ఎన్.శ్రవణ్ మాట్లాడుతూ... ఫస్ట్‌ర్యాంక్ రాజు టీజర్ చాలా బావుంది. మంచి రెస్పాన్స్ వచ్చింది. అతి త్వరలో మిమ్మల్ని ఎంటర్‌టైన్‌చెయ్యడానికి మీ ముందుకు వస్తుంది అని అన్నారు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ రమ్య మాట్లాడుతూ... నేను ఈ చిత్రంలో చాలా మంచి క్యారెక్టర్‌ని చేశాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మంజు సార్‌కి నా ప్రత్యేక కృతజ్ఞతలు. జూన్ 21న మీరందరూ థియేటర్స్‌కి వెళ్ళి మా సినిమాని చూడాలి. మీ అందరి సపోర్ట్ మాకు కావాలి అని అన్నారు.
హీరోయిన్ కౌశిష్ మాట్లాడుతూ... ముందుగా మా టీజుర్‌ని పాటలని ఇంత బాగా హిట్ చేసినందుకు ప్రతిఒక్కరికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అదే విధంగా మా మూవీ కూడా మిమ్మల్ని అందరినీ తప్పకుండా ఎంటర్‌టైన్ చేస్తుంది. మీరందరూ తప్పకుండా మా సినిమా చూసి మమ్మల్ని అదరించాలని మనస్సూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
దర్శకుడు నరేష్ మాట్లాడుతూ... నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్‌గారికి నా కృతజ్ఞతలు. ఫస్ట్ ర్యాంక్ రాజు ఈ చిత్రం ఒక వ్యక్తి జీవితంలో చదువు వందపర్సెంట్ బుద్ధి జీరో పర్సెంట్ ఉంటే ఎలా బ్రతుకుతాడు, ఎలా ఉంటాడు, ఎలాంటి సమస్యలుంటాయి ఎలా సాల్వ్ చేసుకుంటాడు అనే దాని పై కథ నడుస్తుంది. మరో రెండు రోజుల్లో థియేట్రికల్ ట్రైలర్ కూడా మీ ముందుకు వస్తుంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ మంచి ఆర్టిస్టులతో ఈ సినిమా మొత్తం చేశాము. మీరందరూ మా సినిమాని చూసి తప్పకుండా ఆదరించాలని కోరుకుంటున్నాము అన్నారు.
హీరో చేతన్ మాట్లాడుతూ... ప్రతి ఒక్కళ్ళి లైప్‌లో ఒకప్పుడు ఫస్ట్ ర్యాంక్ ఉంటారు. నేను కూడా ఒకప్పుడు ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్‌నే. టీజర్‌కి వచ్చిన రెస్పాన్స్‌కి చాలా హ్యాపీ. నన్ను మీరందరూ ఎంత ట్రోల్ చేసిన పర్వాలేదు. నేను అందులో నా పాత్రని పాత్రమే చూసుకుంటాను. చిన్న సినిమాలు రిలీజ్ కావు అన్నది చాలా పెద్దట్రాష్ అలా ఏమీ ఉండదు. కంటెంట్ బావుంటే తప్పకుండా రిలీజ్ అవుతాయి. నా గత చిత్రం కూడా దిల్‌రాజుగారు రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం గీతా ఆర్ట్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. మా ప్రొడ్యూసర్ చాలా స్ర్టాంగ్ మరియు క్యాపబుల్ పర్సన్. మా చిత్రం జూన్ 21న చాలా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. దర్శకుడు మారుతిగారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇండస్ర్టీలో ఆయన నాకు ఒక గాడ్ ఫాదర్ లాంటి వారు. ఈ సినిమాకి ముందునుంచి పక్కన ఉండి స్టోరీ అంతా విన్నారు అని అన్నారు.
చేతన్‌మద్దినేని, కాశిష్‌వోరా, డా..వి.కె.నరేస్, రాజశ్రీనాయిర్, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందమ్, రావురమేష్, పోసానికృష్ణమురళి, నాగినీడు, తనికెళ్ళభరణి, వెన్నెల కిషోర్, అమిత్‌శర్మా, ప్రయదర్శి, నవీన్‌నేని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డైలాగ్స్ఃఅయ్యాన్ శ్రవన్, లిరిక్స్ఃవనమాలి, ఆర్ట్ఃసత్యసాయి, పబ్లిసిటీడిజైనర్ఃఅనిల్‌భాను, కో-డైరెక్టర్ఃమధుకుమార్‌కె.టి.మ్యూజిక్ఃకిరణ్‌రవీంద్రనాధ్, ప్రొడ్యూసర్ఃమంజునాధ్ వి. కందుకూర్, డైరెక్టర్ఃనరేష్‌కుమార్‌హెచ్.ఎన్. పి.ఆర్.ఓ...వంశీశేఖర్