ఈనెల 14.న విడుదలౌతున్న "జిందా గ్యాంగ్"

06 Jun,2019

1979.లో కర్నాటకలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన  చిత్రం" జిందాగ్యాంగ్" - ది రియల్ గ్యాంగ్. డైనమిక్ స్టార్ దేవరాజ్ హీరోగా నటిస్తున్నాడు. మేఘనా రాజ్ హీరోయిన్. కృష్ణ చంద్ర, లోకి, భరత్ రాజ్ తలికోట్, యువరాజ్ కీలక పాత్రలు పోషించారు. నగేష్ వి. ఆచార్య అందించిన విజువల్స్ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి. శ్రీధర్ వి సంబ్రం అందించిన బాణీలు సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లాయి. ఎస్. మంజు ఈ చిత్రాన్ని కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. మహేష్ ఈ చిత్ర కథను వైవిధ్యంగా... సహజమైన సన్నివేశాలతో రూపొందించారు. ఈనెల 14న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా 

చిత్ర దర్శకుడు, నిర్మాత మాట్లాడుతూ.... యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రాలకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. అలాగే మా జిందా గ్యాంగ్ చిత్రాన్ని కూడా 1979లో జరిగిన యదార్థ సంఘటనల్ని ఆధారంగా చేసుకొని... సినిమాటిక్ వేలో అన్ని వర్గాల్ని మెప్పించే విధంగా తెరకెక్కించాం. ఈ సినిమా స్క్రీన్ ప్లే ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తుంది. గ్రాండియర్ విజువల్స్, మ్యూజిక్ మరో హైలైట్ గా నిలిచింది. డైనమిక్ స్టార్ దేవరాజ్ పెర్ ఫార్మెన్స్ తో సినిమాను నిలబెట్టారు. మేఘనా రాజ్ అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఈనెల 14న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. అని అన్నారు. 

"నటీనటులు"

డైనమిక్ స్టార్ దేవరాజ్, మేఘనా రాజ్,  కృష్ణ చంద్ర, లోకి, భరత్ రాజ్ తలికోట్, యువరాజ్

సాంకేతిక నిపుణులు:

కొరియోగ్రఫీ - త్రిభువన్, రాము
స్టంట్స్ - కౌరవ వెంకటేష్
ఎడిటర్ - రవిచంద్రన్
డిఓపి - నగేష్ వి ఆచార్య
మ్యూజిక్ - శ్రీధర్ వి సంబ్రం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - బి చలపతి
ప్రొడ్యూసర్ - ఎస్.మంజు
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ - మహేష్

Recent News