అభిమానుల ఆధ్వర్యంలో జరిగిన సూపర్ స్టార్ కృష్ణ 77వ జన్మదిన వేడుకలు

07 Jun,2019

 హైదరాబాద్ : సూపర్ స్టార్ కృష్ణ 77వ జన్మదిన వేడుకలు హైదరాబాద్ ఆర్ టి సి క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ 35 MM థియేటర్ లో అభిమానులు రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుదర్శన్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డ్డి , దేవి మేనేజర్ కుమార్ లు కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు. తదనంతరం యల్ కృష్ణ గౌడ్ మరియు ప్రిన్స్ కిరణ్ సారధ్యంలో అన్నదానం నిర్వహించారు . సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 25వ చిత్రం మహర్షి ఘనవిజయం సాధించటం, సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు జరుపుకోవడం తమకెంతో ఆనందంగా ఉందని అభిమానులు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్, వెంకటేష్ , హరీష్  అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసారు

 

2) విజయవాడ : మే 31న సూపర్ స్టార్ కృష్ణ 77వ జన్మదినోత్సవ వేడుకలు కృష్ణ జిల్లా విజయవాడ కృష్ణ లంక నల్లగేట్ సెంటర్ కృష్ణ టీ స్టాల్ యజమాని సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన అధ్యక్షులు కృష్ణ మోహన్ లొల్ల ఆధ్వర్యంలో శంకర మఠంలో హనుమాన్ చాలీసా పారాయణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన మాజీ మేయర్ డాక్టర్ జంధ్యాల శంకర్ ఆంజనేయస్వామి కి పూజలు నిర్వహించి సినీ పరిశ్రమలో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకొన్న సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు కూడా సామజిక సేవా కార్యక్రమాలు అభినందించదగ్గ విషయం. అసోసియేషన్ సభ్యులు 108సార్లు పారాయణం చేసారు.ఈ పారాయణంలో జీవియస్ శర్మ , సుంకర బాబ్జి , రాజారెడ్డి, రామ్మోహన్,బాబూరావ్ తదితర అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేస్తూ అయన ఆయురారోగ్యాలతో ఉండాలని దైవ ప్రార్థన చేసారు 


3 ) చిలకలూరిపేట : సూపర్ స్టార్ కృష్ణ 77వ జన్మదినోత్సవ వేడుకలు చిలకలూరిపేట కృష్ణ మహేష్ యువత హెల్పింగ్ పీపుల్ సొసైటీ E. శ్రీనివాస రెడ్డి ఫ్రెండ్ సర్కిల్ ఆర్ద్వర్యం లో పట్టణం లోని శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో విద్యార్థిని విద్యార్థులు కు నోట్ బుక్స్ , జామెంట్రీ బాక్స్ లు , పెన్నులు పంపిణీ  అనంతరం విద్యార్థులతో కేక్ కట్టింగ్ చేయించడం జరిగినది ఈ కార్యక్రమం లో H.M . ధనలక్ష్మి మాట్లాడుతూ అభిమానులు ఇలా సామజిక సేవా కార్యక్రమాలు అభినందించదగ్గ విషయం అని అన్నారు.  ఉపాద్యాయులు సంజీవ రాజు మరియు సొసైటీ సభ్యులు sk.నాసర్ వలి , Sk. బషీర్ , షేక్ శంశుద్దిన్ ,షేక్ హాజరుద్దీన్ , షేక్ వలి , నరేంద్ర  ,నటరాజ్  అంజిబాబు  , తదితర అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసారు

4 ) తెనాలి : సూపర్ స్టార్ కృష్ణ 77వ జన్మదినోత్సవ వేడుకలు తెనాలిలోని సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన ఈగల్ రెస్టారెంట్ లో రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఈదర వెంకట పూర్ణ చందర్ రావ్ కేక్ కట్ చేసి రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని పేద ముస్లిం మహిళలు 77మందికి చీరలు పంపిణి చేసారు.ఈ సందర్భంగా తెనాలిలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న మనీషా కి కృష్ణ గారి అభిమానులు వాట్సాప్ గ్రూప్ ద్వారా సేకరించిన 12116 రూపాయలను అందజేశారు.పూర్ణచందర్ రావ్ మాట్లాడుతూ అభిమానులు ఇలాంటి సేవాకార్యక్రమాలు నిర్వహించడం తమ హీరో సూపర్ స్టార్ కృష్ణ గారిని ఆదర్శంగా తీసుకోవడం తెనాలి తాలూకా బుర్రిపాలెం బుల్లోడుగా ఆయనకే చెల్లిందని అన్నారు. సయ్యద్ షఫుల్, ఇన్నమూరి వెంకటేశ్వర్లు ( చిన్న ) , ఫణి బోబ్బా , సత్యం, కమలాకర్,రాజేష్ ,శ్రీను,సందీప్,సాయిగిరి,తదితర అభిమానులు పాల్గొన్నారు 
 
5 ) రాజమండ్రి : సూపర్ స్టార్ కృష్ణ 77వ జన్మదినోత్సవ వేడుకలను పట్టణ కృష్ణ మహేష్ సేన యూత్ అధ్యక్షులు తనూజ్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఘనంగా నిర్వహించారు. ఓల్డ్ ఏజ్ హోమ్ వ్యవస్థాపకులు గుబ్బల రాంబాబు ముఖ్య అతిధిగా పాల్గొని కేక్ కట్ చేసి వంద మంది వృద్ధులకు ఫ్రూట్స్,  బ్రేడ్ లు బిస్కెట్ లు పాలు మరియు అన్నదానం నిర్వహించారు. తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలు ఇలా సేవాకార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అన్నారు.ఈ కార్యక్రంలో అయ్యప్ప,మణికంఠ,ధోని,నరేష్,ప్రిన్స్ రాజేష్,లక్ష్మి నారాయణ, శబరీష్,శేషు తదితర అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసారు.

 

6) గోదావరిఖని : సూపర్ స్టార్ కృష్ణ 77వ జన్మదిన వేడుకలు గోదావరిఖని లోని మహర్షి చిత్రం ప్రదర్శించబడుతున్న శ్రీనివాస్ థియేటర్ లో పట్టాన అధ్యక్షులు మెరుగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి థియేటర్ స్టాఫ్ కి స్వీట్స్ పంపిణి చేసారు. మే నెలలో మహేష్ నటించిన మహర్షి చిత్రం విజయవంతవడం, సూపర్ స్టార్ కృష్ణ జన్మదినోత్సవం జరగడం రెండు పండగలు భావించి అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో ఫ్యాన్స్ గౌరవ సలహాదారులు రాజకుమార్, ఉపాధ్యక్షులు జక్కుల రవి, వెంకటేష్ ఫ్యాన్స్ ఉపాధ్యక్షులు అల్లకుంట రాజేందర్ , అభిమానులు అనిల్,జితేందర్,థియేటర్ స్టాఫ్ కిషన్,వెంకన్న,తిరుపతి,శ్రీనివాస్,దేవేందర్,సాయి తదితర అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసారు 

 

7) న్యూ పాల్వంచ : సూపర్ స్టార్ కృష్ణ 77వ జన్మదిన వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని న్యూ పాల్వంచ లోని మహర్షి చిత్రం ప్రదర్షింపబడుతున్న వెంకటేశ్వర థియేటర్ లో జిల్లా అధ్యక్షులు కనగాల రాంబాబు ఆధ్వర్యంలో 

ఘనంగా నిర్వహించారు.థియేటర్ యజమాని పెదబాబు కేక్ కట్ చేసి సూపర్ స్టార్ అభిమానులు కేక్ కట్ చేసి తమ అభిమాన హీరో వలే ఆదర్శప్రాయంగా సామజిక సేవాకార్యక్రమాలు నిర్వహించడం అభినందించదగ్గ విషయమని అన్నారు. వైస్ ప్రెసిడెంట్ రాపాక కాంతారాజు,వినోద్,రవి,శర్మ,పెద్ది తదితర అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసారు

 

8)  గుంటూరు : సూపర్ స్టార్ కృష్ణ 77వ జన్మదిన వేడుకలు సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన జిల్లా అధ్యక్షులు మహమ్మద్ పర్వేజ్ చిస్తీ ఆధ్వర్యంలో గుంటూరు వైస్సార్సీపీ పార్టీ MLA మొహమ్మద్ ముస్తఫా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో MLA ముస్తఫా కేక్ కట్ చేసి సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు ఇలా సేవాకార్యక్రమాలు మంచి పనులు చేయాలనీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యస్ యేసు , శ్రీనివాస్ రెడ్డి ( కొల్లిపర ), వెంకట్ ముక్కంటి, రియాజ్,రెహ్మాన్,ఫిరోజ్  తదితర  అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసారు

 

9) ఏటుకూరు , గుంటూరు :  సూపర్ స్టార్ కృష్ణ 77వ జన్మదిన వేడుకలు గుంటూరు ఏటుకూరు రోడ్డులోని చాకలి గుంటలో రివాల్వర్ కింగ్ కృష్ణ మహేష్ ఫ్యాన్స్ దాసరి వెంకట రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు .ఈ కార్యక్రమానికి జిల్లా సూపర్ స్టార్ కృష్ణ మహేష్ అధ్యక్షులు కోట శేషగిరి ముఖ్యఅతిధిగా పాల్గొని కేక్ కట్ చేసి  

సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులు ఆయనని దర్శంగా తీసుకుంటూ సామజిక సేవాకార్యక్రమాలు నిర్వహించడం మా అభిమానులకే చెల్లిందని ఆనందం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో పాతర కోటి,దార్ల కన్నా,యెడల చిన్న తదితర  అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసారు

 

10) విజయవాడ : సూపర్ స్టార్ కృష్ణ 77వ జన్మదినోత్సవ వేడుకలను సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన యూత్ అధ్యక్షులు సాకేత్ ఆధ్వర్యంలో SKVC చిల్డ్రన్ ట్రస్ట్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చంటి,VL రెడ్డి కేక్ కట్ చేసి అభిమానులకు మిఠాయిలను పంచారు.ఈ కార్యక్రమంలో శివ ,కిరణ్,ఇబ్రహీం తదితర అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసారు

 

11) భీమవరం : సూపర్ స్టార్ కృష్ణ 77వ జన్మదినోత్సవ వేడుకలను సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోపట్టాన వైస్సార్సీపీ MLA గ్రంధి శ్రీనివాస రావు కార్యాలయంలో కేక కట్ చేసి అభిమానులకు స్వీట్స్ పంపిణి చేసారు. అనంతరం బైపాస్ రోడ్ దగ్గరలోని ఉండి రోడ్ లో ఉన్న చిన్న పిల్లల అనాధ ఆశ్రమంలో పిల్లలకు పుస్తకాలు పంపిణి జెసి అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ సినీపరిశ్రమలో ఎన్నో సాహసాలు చేసి తాను సంపాదించినా దాన్ని పరిశ్రమలో పెట్టి ఎంతో మందికి ఉపాధి కల్పించి, ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి అల్లూరి సీతారామరాజుగా సంచలనం సృష్టించిన కృష్ణ అభిమానులకు ఆదర్శప్రాయం అన్నారు. 

ఈ కార్యక్రమంలో రాయప్రోలు శ్రీనివాస్ , BH సుబ్బరాజు,గంట్లప్రసాద్ ,బోనం వరప్రసాద్,బండారు సుబ్బారావు,రాంబాబు తదితర అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసారు

Recent News