ఆచితూచి అడుగులు వేస్తున్న కింగ్‌

06 Jun,2019

 మన్మధుడు 2 షూటింగ్ ని ఎడతెరిపి లేకుండా నాన్ స్టాప్ గా చేయిస్తున్న నాగ్ త్వరగా పూర్తి చేసి ఫస్ట్ కాపీ సిద్ధం చేయాలనీ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ను పురమాయించార‌ట. ఎలాగూ ఫుల్ స్క్రిప్ట్ తో సిద్ధంగా ఉన్నాడు కాబట్టి రాహుల్ కూ అదేమంత సమస్య కాదు. ఇంకా పాటల చిత్రీకరణ బాలన్స్ ఉంది. సమంతా కీర్తి సురేష్ చేస్తున్న క్యామియోలను కూడా ఆల్రెడీ ఫినిష్ చేశారు. కొంత కీలకమైన టాకీ పార్ట్ తప్పించి దాదాపు సినిమా మొత్తం పూర్తి కావొచ్చింది. అయితే ఇక్కడో చిక్కు వచ్చి పడింది. రిలీజ్ డేట్ విషయంలో నాగ్ టీం మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. ఆగస్ట్ 9న విడుదల చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ కేవలం ఆరు రోజుల గ్యాప్ లో సాహో వస్తుంది కాబట్టి అంత రిస్క్ చేయడం ఎందుకనే కోణంలోనే అధిక శాతం అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో పునరాలోచనలో పడ్డట్టు తెలిసింది. 

సాహో సునామికి ధియేటర్లు ఇతర సినిమాలకు దొరకడం కష్టమే. ఆగ‌స్టు మూడు లేదా నాలుగో వారానికి షిఫ్ట్ కావడం సేఫ్ గేమ్ అవుతుంది. నాగ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి. ఇక‌పోతే  తాజా స‌మాచారం ప్ర‌కారం బిగ్‌బాస్‌ 3ని హోస్ట్‌ చేయనున్నారని తెలుస్తుంది. అక్కినేని నాగార్జున ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్వయంగా తెలిపారు. త్వరలోనే దీనిపై అఫీషియల్‌ ప్రకటన కూడా చేయనున్నారట. జూలైలో ఈ షో ప్రారంభం కానున్నట్లు సమాచారం. కాగా ,నాగార్జున ప్రస్తుతం మన్మథుడు సీక్వెల్‌లో బిజీగా ఉన్నారు. నాగార్జున ఎంట్రీ తో ఈ షో మరో ఎత్తుకు చేరుతుందనడంలో సందేహంలేదు.

Recent News