ఈ ప్రపంచంలో రాజు పేద తారతమ్యాన్ని చెరిపేసేది ఒక్క ప్రేమ మాత్రమే. కాకపోతే ఆ ప్రేమకు ఎప్పుడూ అడ్డుగోడలు ఉంటాయి. ఆ గోడలు దాటితే ప్రేమ ఫలిస్తుంది. అలాంటి గోడల వెనక మేడల మధ్య దొరసానిలా ఉన్న అమ్మాయి.. ఊర్లో ఓ సాధారణ పేద కుర్రాడితో ప్రేమలో పడితే.. పర్యవసానాలు ఎలా ఉంటాయో ఊహించవచ్చు.
ఇలాంటి నేపథ్యంలో వస్తోన్న చిత్రమే ‘దొరసాని’. ఆ మధ్య విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా దొరసాని టీజర్ విడుదలైంది..
ఊహించినట్టుగానే ఇది తెలుగులో గుర్తుండి పోయే ప్రేమకథగా నిలవబోతోందని టీజర్ తోనే తెలిసిపోతోంది. సంభాషణలన్నీ తెలంగాణ మాండలికంలో అత్యంత సహజంగా ఉన్నాయి. టీజర్ చివర్లో హీరోహీరోయిన్లిద్దరూ తమ పేర్లు చెప్పుకుంటున్నప్పుడు వచ్చిన ‘నువ్వు నా దొరసాని’ అనే డైలాగ్ యూత్ మాట్లాడుకునే రెగ్యులర్ వర్డ్స్ లో చేరిపోతుంది .
దొరసారి టీజర్ ని ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు లాంచ్ చేసి టీం కి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ:
‘‘ఈ సినిమా కథ రెడీ అవుతున్నప్పటి నుండి నాకు తెలుసు. ఈ కథను తయారు చేయడంలో వారు తీసుకున్న శ్రద్ద చాలా ఉంది. ఐడియా దగ్గర నుండి కథగా మలిచే వరకూ టీం మొత్తం బాగా శ్రమించారు. చాలా నిజాయితీ గా కథను
రెడీ చేసి సినిమాగా మలిచారు. ఒక అందమైన ప్రేమకథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి టీం మొత్తం చాలా అంకిత భావంతో పనిచేసారు. టీజర్ చూడగానే విజువల్స్ చాలా ఇంప్రెస్ గా ఉన్నాయి. మనసుకు హాత్తుకునే విధంగా హీరో, హీరోయిన్లు ఉన్నారు. సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. మహేంద్ర సినిమాను బాగా మలిచాడు. దొరసాని గుర్తిండిపోయే కథ అవుతుందని నా నమ్మకం’’ అని అన్నారు.
దర్శకుడు కె.వి.ఆర్. మహేంద్ర మాట్లాడుతూ:
‘‘ నాలుగేళ్ళ క్రితం మొదలైన దొరసాని తో నా ప్రయాణం ఇంత వరకూ రావడానికి కారణం సురేష్ బాబు గారు, మధుర శ్రీధర్ గారు. ఈ సినిమాలో ఒక నిజాయితీ ఉంటుంది, స్వచ్చత ఉంటుంది, సహాజంగా ఉంటుంది, గొప్ప ప్రేమకథ ఉంటుంది. పదికాలాలు గుర్తుండిపోయే ప్రేమకథ గా దొరసాని గుర్తుండిపోతుంది. నా ప్రయత్నానికి వెన్నుదన్నుగా నిలిచిన నిర్మాత మధుర శ్రీధర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను’’ అన్నారు.
నిర్మాత మధుర శ్రీధర్ మాట్లాడుతూ:
‘‘ రామానాయుడు గారి జయంతి రోజు దొరసాని టీజర్ రిలీజ్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. క్రమశిక్షణ, మంచితనానికి , దార్శనికతకు ఆయన మాకు మార్గదర్శకులు. దొరసాని కొత్త దర్శకులకు రిఫరెన్స్ గా మారుతుంది. సురేష్ బాబు గారు దొరసాని ఐడియాను మెచ్చుకొని మాకు సపోర్ట్ గా నిలిచారు. మహేంద్ర రాసుకున్న స్ర్కిప్ట్ ని వందశాంతం తెరమీదకు తెచ్చాడు. అంత క్లారిటీ ఉన్న దర్శకుడు. ఈ టీజర్ లాంచ్ చేసినందుకు సురేష్ బాబు గారికి ధన్యవాదాలు ’’ అన్నారు.
ఆనంద్ దేవరకొండ, శివాత్మిక హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతోన్న ఈ చిత్రంలో కన్నడ కిశోర్, వినయ్ వర్మ, ‘ఫిదా’ శరణ్య ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
సురేష్ బాబు సమర్పణలో వస్తోన్న ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ : సన్నీ కూరపాటి
ఎడిటర్ : నవీన్ నూలి
సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి
ఆర్ట్ డైరెక్టర్ : జెకె మూర్తి
పి.ఆర్.వో : జి.ఎస్.కె మీడియా
కో ప్రొడ్యూసర్ : ధీరజ్ మొగిలినేని
నిర్మాతలు : మధుర శ్రీధర్ రెడ్డి, యశ్ రంగినేని
రచన, దర్శకత్వం : కె.వి.ఆర్. మహేంద్ర