జూలై 26న గ్రాండ్ రిలీజ్ అవుతోన్న విజయ్‌దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న `డియ‌ర్ కామ్రేడ్‌`

08 May,2019

సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా న‌టిస్తోన్న చిత్రం `డియ‌ర్ కామ్రేడ్‌`. `ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్`. మైత్రీ మూవీమేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, సి.వి.ఎం(మోహ‌న్‌), య‌శ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌కుడు. మే 9న విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా నిర్మాత‌లు సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని జూలై 26న విడుద‌ల చేస్తున్నారు. 

ద‌క్షిణాది భాష‌లైన తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, కన్న‌డ భాష‌ల్లో సినిమాను ఒకే రోజున విడుద‌ల చేస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి ట్రెమెండెస్ రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే జ‌స్టిన్ ప్ర‌భాక‌రన్ సంగీత సార‌థ్యంలో విడుద‌లైన సాంగ్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. 

 

న‌టీన‌టులు:

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:

క‌థ‌, స్క్రీన్‌ప్లే, దర్శ‌క‌త్వం:  భ‌ర‌త్ క‌మ్మ‌

బ్యాన‌ర్స్‌:  మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్‌

నిర్మాత‌లు:  న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.ఎం), య‌ష్ రంగినేని

సి.ఇ.ఒ:  చెర్రీ

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  వై.అనీల్‌

మ్యూజిక్‌:  జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్‌

సినిమాటోగ్ర‌ఫీ:  సుజిత్ సారంగ్

ఎడిటింగ్ & డి.ఐ: శ‌్రీజిత్ సారంగ్‌

డైలాగ్స్‌:  జె కృష్ణ‌

ఆర్ట్ డైరెక్ట‌ర్‌:  రామాంజ‌నేయులు

సాహిత్యం:  చైత‌న్య ప్ర‌సాద్‌, రహ‌మాన్‌, కృష్ణ‌కాంత్‌

కొరియోగ్రాఫర్‌:  దినేష్ మాస్ట‌ర్‌

కాస్ట్యూమ్ డిజైన‌ర్‌:  అశ్వంత్ బైరి, ర‌జ‌ని

యాక్ష‌న్ డైరెక్ట‌ర్‌:  జి.ముర‌ళి.

Recent News