మాస్ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వివి వినాయక్ పరిస్థితి అలాగే ఉంది. టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా ఇమేజ్ తెచ్చుకున్న అయన ఈ మద్యే మెగాస్టార్ రీ ఎంట్రీ ఇస్తూ చేసిన ఖైదీ నంబర్ 150 చిత్రం సూపర్ హిట్ అవ్వడమే కాదు ఏకంగా టాలీవుడ్ లో 125 కోట్ల వసూళ్లు రాబట్టి మెగాస్టార్ స్టామినా ఏమిటో మరోసారి ప్రూవ్ చేసింది. ఆ తరువాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో ఇంటిలిజెంట్ అంటూ సినిమా చేసాడు. ఆ సినిమా అట్టర్ ప్లాప్ అయింది . ఆ సినిమా వచ్చి దాదాపు ఏడాది అవుతున్నా కూడా వినాయక్ కు ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా కమిట్ కాలేదు. ఇంటిలిజెంట్ తరువాత నిర్మాత సి కళ్యాణ్ బ్యానర్ లోనే సినిమా ప్లాన్ చేసాడు వినాయక్. తన నెక్స్ట్ సినిమా నందమూరి బాలయ్యతో ప్రయత్నాలు చేసాడు కానీ అది వర్కవుట్ కాలేదు.
అప్పటినుండి ప్రయత్నాలు సాగిస్తున్న వినాయక్ కు మాస్ రాజా రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన కృష్ణా సంచలన విజయం అందుకుంది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ కాంబినేషన్ సెట్టయింది. ప్రస్తుతం రవితేజ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. వరుస ప్రయాజయాలతో కాస్త బ్రేక్ తీసుకున్న రవితేజ సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టినా కూడా పెద్దగా లాభం లేకపోయింది. చేస్తున్న సినిమాలన్నీ వరుసగా డాం అంటున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న అమర్ అక్బర్ ఆంటోని పెద్ద దెబ్బె కొట్టింది. ప్రస్తుతం మరో సినిమా చేస్తున్న రవితేజ కు ఇప్పుడు హిట్ అవసరం .. సో సరైన హిట్టుకోసం మాస్ రాజా ఈ మాస్ దర్శకుడితో కమిట్ అయ్యాడన్నమాట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది.