ఇటీవలే విడుదలై ప్రపంచ వ్యాప్తంగా రిలీజై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని దూసుకుపోతుంది ''మజిలీ'' . ఎక్కడ చుసినా సినిమా అద్భుతంగా, ఫీల్ గుడ్ మూవీలా ఉందంటూ ప్రశంశలు దక్కుతున్నాయి. అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ''మజిలీ'' కేవలం మూడు రోజుల్లోనే 17 కోట్ల షేర్ రాబట్టుకుంది.
నిన్ను కోరి సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన శివ నిర్వాణ రెండో ప్రయత్నంగా తెరకెక్కించిన మజిలీ ఘనవిజయంతో ఈ దర్శకుడు స్టార్ దర్శకుల లిస్ట్ లోకి చేరిపోయాడు. ముఖ్యంగా ద్వితీయ విఘ్నాన్ని దాటేసిన ఈ దర్శకుడు ఎమోషన్స్, లవ్, సెంటిమెంట్స్ ని అద్భుతంగా డీల్ చేసి శహబాస్ అనిపించుకున్నాడు. దాంతో ఈ దర్శకుడికి ఇప్పుడు వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి. తాజాగా ఈ దర్శకుడికి రౌడీ హీరోతో సినిమా ఛాన్స్ వచ్చిందట.
అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సంచలన స్టార్ గా మారిన విజయ్ దేవరకొండ. రౌడీ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న విజయ్ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్ పూర్తీ కావొచ్చిన ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ మరో సినిమా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత అయన నెక్స్ట్ మూవీ శివ నిర్వాణ దర్శకత్వంలో చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట. త్వరలోనే వీరిద్దరి మధ్య చర్చలు కూడా జరగనున్నాయట. సినిమా సినిమాకు గ్యాప్ తీసుకునే శివ నిర్వాణ మరి ఈ రౌడీ హీరోకోసం ఎంత టైం తీసుకుంటాడో చూడాలి.