దర్శకుడు సుకుమార్ నెక్స్ట్ సినిమా విషయంలో పలు రకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయనకు ఈ ఏడాదిలో సినిమా లేనట్టే .. మహేష్ , సుక్కు సినిమాని రిజెక్ట్ చేసాడు అంటూ రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి .. తాజా సమాచారం ప్రకారం సుక్కు నెక్స్ట్ సినిమా అల్లు అర్జున్ తో తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయి. అల్లు అర్జున్ తన 19 వ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేస్తున్నాడు. ఈ సినిమా ఈ నెల 24నుండి సెట్స్ పైకి రానుంది. ఆ తరువాత తన తదుపరి చిత్రం సుకుమార్ తో కలిసి ఆగస్టులో మొదలు పెట్టనున్నారు.
ఆ తరువాత సుకుమార్ - మహేష్ తో చేసే సినిమా నవంబర్ లో ప్రారంభం కానుందన్నది సుకుమార్ సన్నిహిత వర్గాల సమాచారం. నిజానికి రంగస్థలం తరువాత సుకుమార్ నెక్స్ట్ సినిమాను మహేష్ చేస్తాడంటూ మైత్రి మూవీస్ వెంటనే ప్రకటించింది. కానీ కథ విషయంలో మహేష్ సంతృప్తగా లేకపోవడంతో మరో కథను కూడా వినిపించాడట సుక్కు. అది కూడా నచ్చకపోవడంతో ఇప్పుడు అదే కథ అల్లు అర్జున్ కు బాగా నచ్చడంతో వెంటనే ఈ సినిమాకు ఓకే చెప్పాడు. ఆ కథ సిద్ధం అయింది కాబట్టి , ఇప్పుడు మహేష్ తో సినిమాకోసం కథ విషయంలో కసరత్తులు చేస్తున్నాడు సుకుమార్.
మహేష్ కి లైన్ చెప్పి ఒకే అనిపిస్తే ఫుల్ స్క్రిప్ట్ తరువాత సిద్ధం చేయొచ్చు అన్నది సుక్కు ప్లాన్. మొత్తానికి అల్లు అర్జున్, సుకుమార్ ల కాంబినేషన్ లో రూపొందే హ్యాట్రిక్ సినిమా పై అప్పుడే అంచనాలు నెలకొన్నాయి . దాంతో పాటు మహేష్ - సుక్కు ల కాంబినేషన్ పై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏకంగా ఇద్దరు స్టార్స్ తో సుకుమార్ సినిమాలు లైన్ లో ఉండడం ఆసక్తి రేపుతోంది. సో ఈ ఏడాది రెండు సినిమాలతో దర్శకుడు సుకుమార్ బిజీగా మారాడన్నమాట.