140 కోట్ల బిజినెస్ తో మహర్షి సంచలనం

11 Apr,2019

మహేష్ బాబు తాజా చిత్రం మహర్షి. లేటెస్ట్ గా ఉగాది సందర్బంగా విడుదలైన టీజర్ తో దుమ్ము రేపేసాడు. ఈ టీజర్ తక్కువ సమయంలోనే దాదాపు 20 మిలియన్ వ్యూస్ సాదించి టాలీవుడ్ లోనే క్రేజ్ ట్రైలర్ గా నిలిచింది. ఈ సినిమా కోసం అటు మహేష్ ఫాన్స్ తో పాటు సినిమా అభిమానులంతా ఎప్పుడెప్పుడు చూడాలా అన్న అతృతతో ఉన్నారు. ప్రస్తుతం సమ్మర్ లో పెద్ద హీరోల సినిమాలు లేకపోవడంతో ఈ సమ్మర్ ఎలా ఎంజాయ్ చేయాలో అర్థం కావడం లేదు సినీ అభిమానులకు. అందుకే ఈ సినిమాపై అంత ఆసక్తి.  

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న మహర్షి వచ్చే నెల 9 న విడుదలకు సిద్ధం అయింది. తాజగా షూటింగ్ ముగియడంతో ఈ సినిమా ప్రమోషన్ పనులు మొదలు పెట్టారు. ఇప్పటికే అటు బిజినెస్ కూడా క్రేజీ గా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా సీడెడ్ హక్కులు కూడా అత్యంత భారీ రేటుకు అమ్ముడై సంచలనం రేపింది. ఈ సినిమా సీడెడ్ హక్కులు ఏకంగా 12. 50 కోట్లకు ఓ బడా డిస్ట్రిబ్యూటర్ ఈ హక్కులను సొంతం చేసుకున్నాడు. మహేష్ కెరీర్ లో ఇది సంచలనం. ఎందుకంటే అయన నటించిన భరత్ అనే నేను సినిమా సీడెడ్ లో 9. 5 కోట్లకు మాత్రమే అమ్ముడైంది. పైగా ఆ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో శ్రీమంతుడు లాంటి సంచలన విజయం తరువాత వచ్చిన సినిమా కావడం, అదే అప్పుడు భారీ రేట్ అనుకుంటే, ఇప్పుడు మహర్షి హక్కులు ఇంకా పెరగడంతో  మహర్షి హంగామా మాములుగా లేదు.  

అలాగే ఈ సినిమా డిజిటల్ రైట్స్ కూడా 11 కోట్లకు అమెజాన్ సంస్థ తీసుకున్న విషయం తెలిసిందే. ఇక నైజాంలో కూడా మహర్షికి భారీ డిమాండ్ వస్తుందట ఏకంగా 25 కోట్లవరకు తీసుకునేందుకు పలువురు పంపిణీదారులు ముందుకు వస్తున్నారట. కానీ ఈ సినిమాను దిల్ రాజు సొంతంగా విడుదల చేయాలన్న ఆలోచనలో ఉన్నాడని, అందుకే  అయన నైజాం, వైజాగ్ హక్కులను ఎవరికీ ఇవ్వడం లేదట. 
ఇక  ఆంధ్రా, ఓవర్ సీస్, రెస్ట్ అఫ్ ఇండియా లాంటి ప్రాంతాల హక్కులతో కలిపితే మహర్షి దాదాపు 140 కోట్ల బిజినెస్ చేసే  అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లెక్కన మహర్షి టాలీవుడ్ లో రెండొందల కోట్ల క్లబ్ ని  దాటేయడం ఖాయం అని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు !!  పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కీ రోల్ పోషిస్తున్నాడు.  మరి మహర్షి దెబ్బకు బాక్స్ ఆఫీస్ ఎలా బద్దలవుతుందో చూడాలి.  

Recent News