బంగార్రాజు కోసం రంగంలోకి అఖిల్

11 Apr,2019

హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ మొదటి సినిమా అఖిల్ పరాజయం పాలవడంతో ఆ తరువాత చేసిన సినిమాలైనా హిట్టిస్తాయని చేసినా  వాటి పరిస్థితి అలాగే ఉంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన రెండో చిత్రం  హలో, మూడో చిత్రంగా  వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ మజ్ను సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించక పోవడంతో అఖిల్ నెక్స్ట్ సినిమా విషయంలో తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు అయన నాలుగో చిత్రంగా  బొమ్మరిల్లు భాస్కర్ తో చేసేందుకు రెడీ అయ్యాడంటూ వార్తలు వస్తున్నాయి. అయితే బొమ్మరిల్లు తరువాత భాస్కర్ చేసిన సినిమాలేవీ పెద్దగా విజయాలు అందుకోలేదు, దాంతో ఈ సినిమా చెయ్యాలా వద్ద అన్నఆలోచనలో ఉన్నారన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. 

ఈ లోగా అఖిల్ ని సపోర్ట్ చేసేందుకు బంగార్రాజు రంగంలోకి దిగాడు. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా సూపర్ డూపర్ హిట్టయిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తీ కావొచ్చాయి. 

బంగార్రాజు పాత్రలో నాగ్ అదరగొట్టడమే కాకుండా ఆ పాత్ర ఆయనకు బాగా నచ్చడంతో ఆ పాత్ర టైటిల్ తో సినిమా తెరకెక్కనుంది. 
ఈ నెల చివరి వారంలో సెట్స్ పైకి వచ్చే ఈ సినిమాలో నాగ చైతన్య కూడా నటిస్తున్నాడు. బంగార్రాజు మనవడి పాత్రలో చైతు కనిపిస్తుండగా .. ఓ గెస్ట్ రోల్ లో అఖిల్ కూడా కనిపిస్తాడట. ఈ సినిమాలో తండ్రి .. ఇద్దరు కొడుకులు కలిసి నటిస్తుండడంతో అక్కినేని ఫాన్స్ లో భారీ అంచనాలు పెరిగాయి. బంగార్రాజు గా నాగార్జున ఎలాగూ దుమ్ము రేపడం ఖాయం కాబట్టి .. ఈ సినిమాతో అయినా అఖిల్ కి ఓ మంచి హిట్ అందించాలని ప్లాన్ చేస్తున్నాడెమో నాగ్.  

Recent News