ఆర్ ఆర్ ఆర్ సినిమాకు మొదటి నుండి షాకులు తగులుతూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుండి హాలీవుడ్ హీరోయిన్ డైసీ తప్పుకోవడంతో మరో షాక్ తగిలింది యూనిట్ కి. దాంతో రంగంలోకి దిగిన రాజమౌళి ఆ ప్లేస్ ని భర్తీ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. డైసీ స్థానంలో ఏ హీరోయిన్ ని తీసుకోవాలా అన్న ఆలోచనలో పడ్డాడు. ఇప్పటికే ఇద్దరు బాలీవుడ్ భామల పేర్లు ఫైనల్ చేసాడని, అందులో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతుంది. ఆ ఇద్దరు బాలీవుడ్ భామలు ఎవరో కాదు, ఒకరు గ్లామర్ భామ శ్రద్ధ కపూర్ అయితే మరో భామ శ్రీదేవి తనయ జాహ్నవి కపూర్. వీరిద్దరిలో ఎవరిని ఒకరిని ఫైనల్ గా ఎంపిక చేయాలనీ చూస్తున్నాడట.
ఇప్పటికే సాహో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధ కపూర్ ని ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. శ్రద్ధ కపూర్ కు అటు టాలీవుడ్ లో మంచి క్రేజీ తెచ్చుకుంటుంది. ఆమె అయితే అటు క్రేజ్ కూడా ఉంటుంది కాబట్టి శ్రద్ధ కె ఓటేసే అవకాశం ఉంది. మరి జాహ్నవి కూడా ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంటుంది. వీరిద్దరిలో ఎవరిని అదృష్టం వరిస్తుందో చూడాలి. రామ్ చరణ్ - ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ భారీ చిత్రం ప్రస్తుతం పూణే లో షూటింగ్ జరుపుకుంటుంది. రామ్ చరణ్ కాలికి గాయం కావడంతో చరణ్ కు మూడు వారాలపాటు బ్రేకులిచ్చారు. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జులై 30న విడుదల చేస్తారట.