బాయ్ పోస్టర్‌ పోస్టర్ విడుదల

09 Apr,2019

అమర్‌ విశ్వరాజ్‌ దర్శకత్వంలో విశ్వరాజ్‌ క్రియేషన్స్‌ పతాకంపై ఆర్‌.రవి శేఖర్‌ రాజు, అమర్‌ విశ్వరాజ్‌ సంయుక్తంగా 'బాయ్' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. లక్ష్య, సాహితి, నీరజ్‌, వినరు వర్మ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ని అన్నపూర్ణ స్టూడియోలోని 'మహర్షి' సెట్‌లో దర్శకుడు వంశీపైడిపల్లి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'టైటిల్‌ చాలా బాగుంది. పోస్టర్‌ చూస్తే నాకు స్కూల్‌ రోజులు గుర్తుకొచ్చాయి. టెన్త్‌ క్లాస్‌ అబ్బాయి కాలేజ్‌ వైపు చూస్తుంటే సినిమాలో ఏదో ఉందనే క్యూరియాసిటీ కలుగుతుంది. కథ విన్నాను. చాలా బాగుంది. దర్శకుడికి సినిమా పట్ల ఉన్న ప్యాషన్‌ని తెలియజేస్తుంది. పోస్టర్‌ విషయంలోనే ఇంత శ్రద్ధ తీసుకుంటే సినిమాని ఇంకెంత బాగా తీశారో అర్థమవుతుంది. సినిమా చూస్తాను. టీమ్‌కి అభినందనలు' అని అన్నారు.  

Recent News