మనిషా ఆర్ట్స్ ప్రై.లి. సమర్పణలో మానిక్యం మూవీస్, ఎస్ ఎం కె ఫిలిమ్స్ సంయుక్తంగా బావ మరదలు ఫేమ్ మోహనకృష్ణ హీరోగా రవికిశోర్ బాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'గ్యాంగ్ లీడర్'. ఈ చిత్ర షూటింగ్ ఫిలిమ్ ఛాంబర్ లో మొదలైంది. ఈ చిత్రానికి క్లాప్ వి.సాగర్ కొట్టగా మనిషా ఆర్ట్స్ ప్రై. లి.అధినేత కిషోర్ రాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. రవికిశోర్ బాబు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో .. హీరో మోహన్ కృష్ణ మాట్లాడుతూ...సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 20నుంచి మొదలవుతుంది. చిరంజీవిగారు గ్యాంగ్ లీడర్ చిత్రం పేరు పెట్టడానికి కారణం ఆ చిత్రం లో లాగానే నలుగురు స్నేహితులు కలిసి సమాజంలో జరిగే అవినీతి ని ఎలా ఎదుర్కున్నారు అనేది కథ. ఖైదీ 150 చిత్రం లాగానే ఈ సినిమాలో కూడా మంచి మేసేజ్ ఉంది. రైతుల మద్దతు ధరలకు సంభందించిన మంచి పాయంట్ ని ఈ చిత్రం లో చూపించడం జరిగింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి చిరంజీవి గారి పుట్టినరోజు అయిన ఆగస్టు 21నాడే ఈ చిత్రo విడుదల చేయనున్నాము అని అన్నారు.
ఈ చిత్ర దర్శకుడు మాట్లాడుతూ... ఈ నెల 20 నుంచి పశ్చిమగోదావరి లో సింగల్ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తిచేయబోతున్నాం. ఈ బ్యానర్ లో చెయ్యడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు.
హీరోయిన్ మాట్లాడుతూ... ముందు ఈ టైటిల్ కి సంబంధించి చాలా వివాదాలు వచ్చాయి. కానీ మా యూనిట్ ఎక్క డా వెనుకడుగు వేయకుండా ముందుకెళ్లింది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు నా ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.