జాతీయ నటుడిగా ఇమేజ్ తెచ్చుకున్న కమల్ హాసన్ చేసినన్ని భిన్నమైన పాత్రలను ప్రపంచ వ్యాప్తంగా ఏ హీరో చేయలేదని చెప్పాలి కమల్ హాసన్ స్పూర్తితో అక్కడ చాలా మంది కొత్త హీరోలు ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారు. అందులో విక్రమ్, సూర్య, విజయ్ సేతుపతి లాంటి హీరోలు ముందుంటారు. ఇక స్టార్ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న సూర్య తాజాగా మరో భిన్నమైన సినిమాకోసం సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. ఆయన తదుపరి చిత్రాన్ని జాతీయ దర్శకుడు బాలతో చేస్తాడని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.
ఈ మధ్య సూర్య నటించిన సినిమాలన్నీ వరుస పరాజయాల పాలవడం. పైగా అన్ని రొటీన్ పాత్రలు కావడంతో సూర్యకు కూడా బోర్ కొట్టినట్టుంది. అందుకే కాస్త బిన్నంగా అయన బాలతో సినిమా చేయాలనీ ఫిక్స్ అయ్యాడు. గతంలో బాల దర్శకత్వంలో నంద, పితామగన్ సినిమాలు చేసాడు. పితామగన్ తెలుగులో శివపుత్రుడు పేరుతొ విడుదలైంది. పితామగన్ సూపర్ హిట్ అవ్వడమే కాకుండా అటు జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది. అందుకే రెగ్యులర్ ఫార్మేట్ కి బ్రేక్ ఇవ్వడానికి అయన ఈ ప్రయత్నం చేస్తున్నట్టు కన్పిస్తుంది.