సూపర్ స్టార్ సరసన కీర్తి సురేష్

04 Apr,2019

గ్లామర్ హీరోయిన్ గా ఆకట్టుకున్న కీర్తి సురేష్  మహానటి సినిమాతో తన నట విశ్వరూపం చూపించి శహబాస్ అనిపించుకుంది. ఆ సినిమా తరువాత తమిళంలో రెండు మూడు సినిమాలు చేసినప్పటికీ ఏ సినిమా పెద్దగా కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు .. కానీ లేటెస్ట్ గా ఈ భామ గోల్డెన్ ఛాన్స్ కొట్టేసినట్టు కోలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ గోల్డెన్ ఛాన్స్ ఏమిటంటే .. జాతీయ దర్శకుడు మణిరత్నం సినిమాలో కీర్తి హీరోయిన్ గా అవకాశం పట్టేసిందట.

ఆ వివరాల్లోకి వెళితే వరుస పరాజయాలతో డీలాపడ్డ మణిరత్నం లేటెస్ట్ గా ”నవాబ్స్” సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి హీరోలుగా నటించిన ఈ సినిమా తమిళంలో సంచలన విజయం అందుకుంది. ఈ సినిమా ఇచ్చిన ఉత్సహంతో మణిరత్నం మరో మల్టీస్టారర్ కు సన్నాహాలు చేస్తున్నాడు.

రాజా రాజా చోళుని చరిత్ర ఆధారంగా ఈ సినిమా ఉంటుందని టాక్. ”పొన్నియిన్ సెల్వం” పేరుతొ తెరకెక్కే ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా ఎంపికైందట. చారిత్రక నేపథ్యం ఉన్న కథతో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం భారీ షెడ్యూల్ ప్లాన్ చేసారు. ఇందులో విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి...

Recent News