కాంచన హిందీ రీమేక్ లో ఖైరా అద్వానీ

04 Apr,2019

రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన కాంచన చిత్రం ఎంత సంచలన విజయం అందుకుందో అందరికి తెలుసు. హార్రర్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా హర్రర్ సినిమాలకు కొత్త ఊపునిచ్చి .. ప్రేక్షకులను అటువైపు చూసేలా చేసింది .. ఆ సినిమా తరువాత డజన్ల కొద్దీ హర్రర్ సినిమాలు సౌత్ లో వస్తూనే ఉన్నాయి. కాంచన పేరుతొ వచ్చిన ఈ సినిమా ”ముని” సినిమాకు సీక్వెల్. లారెన్స్, లక్ష్మి రాయ్ , కోవై సరళ ముఖ్యపాత్రల్లో ప్రముఖ నటుడు శరత్ కుమార్ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ సినిమాకు మూడో సీక్వెల్ గా ”కాంచన 3” వస్తున్న విషయం తెలిసిందే . మరో వైపు కాంచన చిత్రాన్ని ఇప్పుడు హిందిలో రీమేక్ చేస్తున్నారు.

అక్షయ్ కుమార్ హీరోగా నటించే ఈ సినిమాకు రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనున్నారట. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా కైరా అద్వానీ ఎంపికైంది. ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ”భరత్ అనే నేను” సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కైరా, మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకుంది. కాంచన పేరుతొ హిందీలో తెరకెక్కే ఈ సినిమాలో మరో ప్రముఖ నటుడు మాధవన్ కూడా నటిస్తున్నట్టు టాక్. మరి ఇందులో అసలు కాంచన ఎవరన్న విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి మంచి క్రేజీ అఫర్ కొట్టేసిన కైరా తెలుగులో రామ్ చరణ్ తో వినయ విధేయ రామలో కూడా నటించింది.

Recent News