హీరో విశాల్ కు ఈ మద్యే షూటింగ్ లో గాయాల పాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న విశాల్ పూర్తిగా కోలుకున్నాడట. దాంతో ఆయన ఈ రోజు నుండి మళ్ళీ షూటింగ్ లో పాల్గొననున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. విశాల్ హీరోగా సుందర్ సి దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ రూపొందుతున్న విషయం తెలిసిందే . తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటలీ లోని అజర్ బైజాన్ లో జరుగుతుంది. అక్కడే యాక్షన్ సన్నివేశాల్లో భాగంగా చేజ్ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా బైక్ స్కిడ్ అయి కిందపడడంతో చేతికి, కాలికి గాయాలు అయ్యాయి. దాంతో వెంటనే ఆయన్ను పక్కనే ఉన్న హాస్పిటల్ లో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పించారు. ప్రసుతం కోలుకున్న విశాల్ మళ్ళీ షూటింగ్ కి రెడీ అయ్యాడట. విశాల్ కి గాయాలు అయ్యాయని వార్తా రావడంతో అయన ఫాన్స్, ఫ్యామిలీ మెంబర్ తీవ్రంగా టెన్షన్ పడ్డారు. ప్రస్తుతం అయన కోలుకోవడంతో అందరు హ్యాపీ. ఇక హీరో విశాల్ తాజాగా నటించిన అయోగ్య త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.