నటుడు మోహన్ బాబు పై చెక్ బౌన్స్ కేసులో ఎర్రమంజిల్ 23 మెట్రోపాలిటన్ కోర్టు ఏడాదిపాటు శిక్షను ఖరారు చేసిందంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే . ఈ విషయం పై మోహన్ బాబు స్పందించాడు. కావాలనే నాపై చెక్ బౌన్స్ కేసు వేసి కోర్టును తప్పుదోవ పట్టించారని అయన అన్నారు. 2009లో సలీం సినిమా చేస్తున్న సమయంలో ఆ సినిమాకు సంబంధించిన మొత్తాన్ని దర్శకుడు వై వి ఎస్ చౌదరికి చెల్లించేసాం. మా బ్యానర్ లో మరో సినిమా చేయడానికి అయనకు 40 లక్షల అడ్వాన్ చెక్ కూడా ఇచ్చాము . అయితే సలీం సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో వై వి ఎస్ చౌదరితో తరువాతి సినిమాను వద్దనుకున్నామన్నారు. ఈ సినిమాను మనం చేయడం లేదని ఆయనకు కూడా చెప్పినట్టు, అలాగే ఆ చెక్ ని బ్యాంక్ లో వేయొద్దంటూ సమాచారం కూడా ఇచ్చామని మోహన్ బాబు పేర్కొన్నాడు. మేము చెప్పినా కూడా అయన కావాలనే ఆ చెక్ ని బ్యాంక్ లో వేసి బౌన్స్ చేసారని మోహన్ బాబు ఆరోపించారు.