RX 100` చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సొగసరి పాయల్ రాజ్‌పుత్.. తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మన్నారా చోప్రా హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న `సీత` చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌లో నటించారు. సినిమా కథానుసారం కీలక సమయంలో.. `బుల్ రెడ్డి... ` అంటూ సాగే ఈ స్పెషల్ పెప్పీ మాస్ సాంగ్ మాస్ ఆడియెన్స్ సహా అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పించనుంది. ఈ సాంగ్‌లో పాయల్ సో లో పెర్ఫామెన్స్ హైలైట్‌గా నిలవనుంది. సోనూసూద్ కీలక పాత్రలో నటిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్ 2.5 మిలియన్ వ్యూస్‌తో సూపర్బ్ రెస్పాన్స్‌ను రాబట్టుకుంది. ఈ టీజర్‌తో సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. రీసెంట్‌గా ట్రేడ్ వర్గాల్లో బిజినెస్ డీల్స్ కూడా పూర్తయ్యాయి. ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.