సంచలన విజయంలో లక్ష్మిస్ ఎన్టీఆర్

02 Apr,2019

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా గత నెల 29న విడుదలై మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.  తెలంగాణతో పాటు యూఎస్‌లో విడుదలైన ఈ చిత్రం హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు రాజకీయ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి అడుగుపెట్టిన తరవాత జరిగిన పరిణామాలతో తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్ సందర్బంగా చిత్రంలో కీలక పాత్రలు పోషించిన విజయ్ కుమార్, శ్రీ తేజ్, యజ్ఞ శెట్టి లు మీడియాతో ఆ విజయాన్ని పంచుకున్నారు .. ఈ సందర్బంగా యజ్ఞా శెట్టి మాట్లాడుతూ .. ఈ సినిమాలో లక్ష్మి పార్వతి పాత్రలో నటించే అవకాశం రావడం ఆనందంగా ఉంది. ప్రసుతం ఆ పాత్రకు మంచి ప్రశంశలు లభిస్తున్నాయి. ఈ పాత్ర గురించి దర్శకుడు వర్మ చెప్పినప్పుడు నాకు లాకెఎంసి పార్వతి ఎవరో తెలియదు .. కానీ వర్మ ఆమె గురించి చెప్పినప్పుడు ఎగ్జాయిట్ అయ్యాను. ప్రస్తుతం వస్తున్న రెస్పాన్స్ కి వర్మ గారే కారణం . ఆ పాత్ర విషయంలో అయన చెప్పినట్టు చేశాను. ఇదివరకే వర్మ తో వీరప్పన్ చేశాను .. ఆ సినిమాకు కూడా మంచి పేరొచ్చింది. ప్రస్తుతం నయీమ్ డైరీస్ అనే సినిమా చేస్తున్నాను .. ఇది తెలుగు, కన్నడలో తెరకెక్కుతుంది. నటుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ .. నేను రంగస్థలం నుండి వచ్చాను. ఇప్పటికి నాటకాలు ఆడుతున్నాను. ఎన్టీఆర్ లా ఉంటాడని ఎవరో నా గురించి వర్మకు చెప్పారట. అప్పుడు అయన నన్ను కలవమన్నారు. కలిసినప్పుడు ఇలా ఎన్టీఆర్ పాత్ర చేయాలి .. ఆయనలా మీరు బాగా చేస్తారని విన్నాను అని చెప్పారు .. నిజంగా నా అభిమాన నటుడు ఎన్టీఆర్ గారు . అయన పాత్ర పోషించే అవకాశం రావడం అదృష్టాంగా భావిస్తాను. చిన్నప్పటినుండి నాకు ఎన్టీఆర్ గారంటే అభిమానం .. నాటకాల్లో కూడా అయన పాత్రలు వేసాను. ఆ తరువాత సినిమాల్లో నటించాలని ప్రయత్నాలు చేశాకానీ ఎవరు ఇవ్వలేదు .. ఇక ఎన్టీఆర్ రూపంలో ఈ సినిమాలో అవకాశం దక్కడం. చేసిన సినిమాకు గొప్ప ప్రశంశలు రావడం ఆనందంగా ఉంది. సినిమాలో ఎన్టీఆర్ గా చక్కగా నటించవని అంటున్నారు. ఇకపై సినిమాల్లో అవకాశం వస్తే తప్పకుండా చేస్తా అని అన్నారు. నటుడు శ్రీ తేజ్ మాట్లాడుతూ .. ఈ సినిమాలో చంద్రబాబు పాత్ర పోషించడం ఆనందంగా ఉంది. ఇటీవలే ఎన్టీఆర్ బయోపిక్ లో వై ఎస్ పాత్రలో కనిపించడం. ఆ తరువాత ఈ సినిమాలో చంద్రబాబు గా చేయడం మరచిపోలేని అనుభూతి. ఇందులో చంద్రబాబు గా నెగిటివ్ ఉన్న పాత్రలో చేశాను. నా పాత్ర గురించి ఎవరు నన్ను విమర్శించలేదు. అందరు బాగా చేసావని అంటున్నారు. నిజంగా ఆర్టిస్టుకు ఓ మంచి పాత్ర కావాలి. అలాంటి గుర్తింపు ఉన్న పాత్ర వర్మ గారు ఇచ్చారు. ఇంతకు ముందు అయన తీసిన వంగవీటి లో  చేసిన పాత్రకు మంచి అప్లాజ్ వచ్చింది. ఇకపై నటుడిగా నన్ను నేను ప్రూవ్ చేసుకునే పాత్రలే చేస్తా అంటూ ముగించారు.  

Recent News