వరుస సినిమాలతో సూర్య బిజీ

02 Apr,2019

సక్సెస్ కంటే కూడా సినిమాల గురించి ఆలోచించే తమిళ స్టార్ హీరో  సూర్య వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. తన నుంచి అభిమానులు ఆశించే యాక్షన్ .. ఎమోషన్ కి ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళుతున్నాడు. ఒక సినిమా పూర్తవుతూ ఉండగానే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చేస్తున్నాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఎన్జీకే' సిద్ధమవుతోంది.  ఆ తరువాత సినిమాగా 'కాప్పన్' షూటింగు జరుగుతోంది. ఆగస్టు 30వ తేదీన ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే దర్శకురాలు సుధ కొంగరకి సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. 'గురు' సినిమాతో దర్శకురాలిగా మంచి పేరు తెచ్చుకున్న ఆమె, సూర్యతో సినిమాకి సన్నాహాలు చేసుకుంటోంది. వచ్చేనెలలో ఈ సినిమాను లాంచ్ చేయనున్నారనేది తాజా సమాచారం. 

Recent News