సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం మహర్షి. ఈ నెల 25న విడుదల అవుతున్న ఈ సినిమా తప్ప ఈ లోపు పెద్ద హీరోల సినిమాలేవీ లేకపోవడంతో అందరి దృష్టి మహర్షి పైనే పడింది. ఇప్పటికే విడుదలైన సాంగ్, ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యం గా ఇటీవలే విడుదలైన మొదటి సాంగ్ అప్పుడే లక్షల్లో వ్యూస్ రాబడుతూ దూసుకుపోతుంది. ఇక దర్శక నిర్మాతలు కూడా ప్రమోషన్ మొదలు పెట్టేసారు. దాంతో పాటు బిజినెస్ కూడా భారీగానే జరుగుతుంది. మహర్షి సినిమాకు వస్తున్న బిజినెస్ డీల్స్ చూస్తుంటే మహేష్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బిజినెస్ జరిగేలా ఉందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని అమెజాన్ సంస్థ ఏకంగా 11 కోట్లకు సొంతం చేసుకోవడం విశేషం . ఇక థియేట్రికల్ రైట్స్ .. సాటిలైట్ హక్కులు కలిపి ఈజీగా డెబ్భై కోట్లు చేస్తుందని అంటున్నారు .. ఈ లెక్కన మహేష్ సినిమా వందకోట్ల సినిమాగా నిలబడడం ఖాయమని ట్రెడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా .. అల్లరి నరేష్ మరో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.