అజయ్, రంగ, అక్షత, సంతోష, అశోక్ కుమార్ ముఖ్యపాత్రల్లో వాస్తావ్ దర్శకత్వంలో నందలాల్ క్రియేషన్స్ బ్యానర్ పై నందం శ్రీ వాస్తవ్ నిర్మిస్తున్న చిత్రం స్పెషల్. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తీ చేసుకుని మే లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్బంగా మంగళవారం చిత్ర ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ కార్యక్రంలో నటుడు అజయ్ మాట్లాడుతూ .. ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించాను. పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా కనిపిస్తా. దర్శకుడు వస్తావ్ అద్భుతమైన కథ చెప్పాడు. నిజంగా ఇది మెడికో థ్రిల్లర్ లాంటిది అని చెప్పాలి. సరికొత్త పాయింట్ తో తీసిన ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది అన్నారు.
దర్శకుడు వస్తావ్ మాట్లాడుతూ .. ఎక్కడో చదివిన విషయం స్ఫూర్తి తో తెరకెక్కించిన కథ ఇది. తప్పకుండ ప్రేక్షకులకు ఆసక్తి కలిగించేలా ఉంటుంది. అజయ్ చక్కగా చేసాడు. నిజానికి ఈ సినిమాకు నాలుగైదు కోట్లతో నిర్మించాలి కానీ మాదగ్గర ఉన్న బడ్జెట్ తో చాలా జాగ్రత్తగా సినిమా చేసాం. ఇటీవలే సెన్సార్ వాళ్ళు కూడా సినిమా చూసి బాగుంది అని మెచ్చుకున్నారు. ఈ చిత్రాన్ని మే లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. హీరోయిన్ అక్షత మాట్లాడుతూ ... ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం ఆనందంగా ఉంది. చాలా మంచి పాత్ర ఇచ్చాడు దర్శకుడు. తప్పకుండా ఈ పాత్ర నాకు మంచి గుర్తింపును ఇస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.