చంద్రబాబు వెన్నుపోటు అంశాన్ని హైలెట్ గా చేస్తూ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం లక్ష్మిస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మి పార్వతి ఎంట్రీ ఇచ్చినప్పటినుండి జరిగిన కథతో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందు పెద్ద దుమారమే రేపింది. సినిమా విడుదల విషయంలో ఎన్నో అవాంతరాలు ఎదురైనా .. కోర్టుకు వెళ్లి మరి తేల్చుకుంటానని చెప్పిన వర్మ చెప్పినట్టుగానే అనుకున్న డేట్ కు విడుదల చేసాడు. అయితే ఆంధ్రా లో తప్ప ప్రపంచ వ్యాప్తంగా నిన్న విడుదలైన ఈ సినిమా పై ప్రేక్షకుల ఆసక్తి కూడా ఓ రేంజ్ లో ఉంది. దాని తగ్గట్టే సినిమా ఓపెనింగ్స్ విషయంలో సంచలనం రేపింది. ఎలాంటి స్టార్స్ లేకుండా కేవలం వర్మ, చంద్రబాబు వెన్నుపోటు నేపథ్యంలో తీసిన ఈ సినిమా మొదటి రోజే ఏకంగా 4 కోట్ల వసూళ్లు రాబట్టి దుమ్ము రేపింది. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ ఈ రేంజ్ వసూళ్లు రాబట్టింది విశ్లేషకులు భావిస్తున్నారు. మొదటి రోజు ఈ సినిమా అన్ని థియేటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డులతో నిండిపోయింది. ఈ జోరు శని, ఆది వారలు కూడా కొనసాగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఓ వైపు సినిమా చూడాలని ఆసక్తి తో జనాలు ఎగబడుతుంటే చుసిన వాళ్ళు మాత్రం సినిమా బి గ్రేడ్ సినిమా ఉందంటూ , కేవలం లక్ష్మి పార్వతి పాయింటాఫ్ వ్యూ లోనే ఉందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.