శశికళ బయోపిక్ తీస్తున్న వర్మ

02 Apr,2019

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ..  ''లక్ష్మిస్ ఎన్టీఆర్'' పేరుతొ సినిమా తో  పెద్ద దుమారమే రేపాడు.  ఇది కుటుంబ కుట్రల కథ అంటూ తెరకెక్కించిన ''లక్ష్మిస్ ఎన్టీఆర్'' ఇటీవలే ఒక్క ఆంధ్రా లో తప్ప అంతటా విడుదలై సంచలనం రేపింది.  ఈ విషయం పక్కన పెడితే .. తన నెక్స్ట్ సినిమా గురించి అప్పుడే ప్రకటించేశాడు వర్మ. ఈ సారి అయన ఫోకస్ తమిళనాడు పై పడింది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రియనేస్తం శశికళ జీవిత కథతో సినిమా చేస్తానంటూ సోషల్ మీడియా లో శశికళ పేరుతొ ఓ పోస్టర్ పెట్టేసి .. నెక్స్ట్ సినిమా ఇదే అంటూ ప్రకటించేశాడు. ప్రేమ ప్రమాదకరమైన రాజకీయం అంటూ దానికి ట్యాగ్ కూడా పెట్టేసారు. పైగా ఈ ప్రాజెక్టు ను ప్రకటించడం చాలా సంతోషంగా ఉందంటూ పేర్కొన్నాడు వర్మ. మనసంటూ లేని కఠినాత్ములు , జైళ్లు, మన్నార్ గుడి గ్యాంగ్స్ కు వ్యతిరేకంగా అల్లుకున్న ఓ బంధం కథ ఇది అంటూ కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం వర్మ విడుదల చేసిన పోస్టర్ ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది. అన్నట్టు ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ లో  తప్ప అంతటా విడుదల చేస్తానంటూ ప్రకటించాడు. ప్రస్తుతం శశికళ సినిమా అనగానే తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు క్రియేట్ అవుతున్నాయి.  జయతో ఎంతో అనుబంధం ఉన్న శశికళ జయ మరణం తరువాత రాజకీయ సమీకరణ చేసి ముఖ్యమంత్రి కావాలని ప్లాన్ వేసింది .  శశికళ ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.  మొత్తానికి శశికళ తో  మరో సంచలనాన్ని ప్రకటించిన వర్మ ... ఈ సినిమా తో  ఇంకెంత దుమారం రేపుతాడో చూడాలి !! 

Recent News