క్రిష్ నెక్స్ట్ హిందీ సినిమా చేస్తాడట

31 Mar,2019

దర్శకుడు క్రిష్   తెరకెక్కించిన ఎన్టీఆర్ కధానాయకుడు, మహా నాయకుడు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. పైగా విమర్శలకు దారి తీసింది.  మరో వైపు హిందీలో భారీ సినిమాగా తెరకేకించిన మణికర్ణికా విషయంలో వివాదాలు తలెత్తాయి. ఇక నిర్మాతగా అంతరిక్షం కూడా పెద్ద దెబ్బె కొట్టింది. ఈ టెన్షన్స్ తో ఉన్న క్రిష్ నెక్స్ట్ సినిమా విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు. అయితే ఈ సారి అయన తెలుగు సినిమా కాకుండా హిందీలో హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఇప్పటికే ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ విషయంలో చర్చలు జరుగుతున్నాయని తెలిసింది.  ఇదికూడా ఓ భారీ సినిమా అని టాక్. త్వరలోనే దీనికి సంబందించిన అధికారిక వివరాలు తెలియచేస్తారట. గమ్యం సినిమాతో విమర్శకుల ప్రశంశలు అందుకుని దర్శకుడిగా మంచి ఇమేజ్ తెచ్చుకున్న క్రిష్ ఆ తరువాత తెరకెక్కించిన సినిమాలు మానవీయ కోణంలో హృద్యంగా మలుస్తాడని పేరు తెచ్చుకున్నాడు.  బాలయ్య తో ఎన్టీఆర్ సినిమా అఫర్ రావడంతో హిందీలో మణికర్ణికా సినిమాను మధ్యలోనే వదిలి రావడంతో హీరోయిన్ కంగనా రనౌత్ ఇతగాడిపై గట్టిగానే ఫైర్ అయింది. మొత్తానికి పోయినచోటే వెతుక్కోవాలనే ఆలోచనలో భాగంగా క్రిష్ మరో బాలీవుడ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ తో సినిమా ఉంటుందని టాక్.  

Recent News