వ్యూహం టైటిల్ తో నాని కొత్త సినిమా

01 Apr,2019

ప్రస్తుతం జెర్సీ విడుదల కోసం ఎదురు చూస్తున్న నాని మరోవైపు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో గ్యాంగ్ లీడర్ షూటింగ్ చకచకా కానిచ్చేస్తున్నాడు. దసరాకే రావాలని టార్గెట్ పెట్టుకోవడంతో చాలా టైట్ షెడ్యూల్స్ లో ల్యాగ్ లేకుండా ప్లానింగ్ చేసుకుంటున్నారు. వీటి తర్వాత నాని తనకు మొదటి బ్రేక్ ఇచ్చిన దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణకు ఓ సినిమా కమిట్ అయిన సంగతి తెలిసిందే.
ఈ ఇద్దరి కాంబోలో గతంలో వచ్చిన అష్టా చెమ్మా జెంటిల్ మెన్ రెండూ సూపర్ హిట్స్ అయ్యాయి. ఇది హ్యాట్రిక్ మూవీ అవుతుంది. ఇందులో నానితో పాటు మరో హీరో కూడా ఉంటాడు. దుల్కర్ సల్మాన్ కోసం ఇంద్రగంటి చాలా ట్రై చేసినట్టుగా గతంలో వార్తలు వచ్చాయి కానీ ఫైనల్ గా అది సుధీర్ బాబు చెంతకు చేరుకుంది. సో నాని సుధీర్ బాబులు కలిసి చేస్తున్న ఫస్ట్ మూవీ ఇది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే దీనికి టైటిల్ కూడా ఫిక్స్ అయ్యారట. వ్యూహం అని ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ అయినట్టుగా ఇన్ సైడ్ టాక్. వ్యూహం అనే పేరు చూస్తుంటే ఇదేదో థ్రిల్లర్ జానర్ లా అనిపిస్తోంది.  ఇంకొద్ది రోజుల్లో దీనికి సంబంధించిన ప్రకటన రావొచ్చు. 

Recent News