వరుసగా మూడు సినిమాలతో అల్లు అర్జున్

30 Mar,2019

'నా పేరు సూర్య .. నా ఇల్లు ఇండియా'' సినిమా బన్నీని తీవ్ర నిరాశకు గురిచేసింది. ఆ సినిమా కోసం తన మేక్ ఓవర్ ని మార్చేసి బాగానే కష్టపడి చేసాడు .. కానీ ఎందుకో అది ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అటు స్టార్ రైటర్ గా టాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకున్న వక్కంతం వంశీ ఆ సినిమాతో దర్శకుడిగా టర్న్ ఇవ్వాలని చేసిన ప్రయత్నం వృధా అయింది. ఆ సినిమా ప్లాప్ తో నెక్స్ట్ సినిమా విషయంలో తీవ్రంగా ఆలోచనలో పడ్డ బన్నీ .. నెక్స్ట్ సినిమా కోసం ఏకంగా 8 నెలల టైం తీసుకుని సేఫ్ గేమ్ ఆడాడు. అదే క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్ తో సినిమా. బన్నీ - త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన ''జులాయి'' సినిమా సంచలన విజయం సాధిస్తే .. రెండో సినిమా ''సన్నాఫ్ సత్యమూర్తి'' యావరేజ్ హిట్ గా నిలిచింది .. అయినా సరే మూడో సినిమా విషయంలో ఇద్దరు చాలా సీరియస్ గా ఉన్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తీ కావొచ్చిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానున్నట్టు తెలిపారు. 
ఇక ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి రాకముందే అల్లు అర్జున్ మరో దర్శకుడితో సినిమాకు ఓకే చెప్పాడట? ఆ దర్శకుడు ఎవరో కాదు ఈ మద్యే నాని హీరోగా 'ఎం సి ఏ' ( మిడిల్ క్లాస్ అబ్బాయి ) అంటూ ఓ ఫ్యామిలి హిట్టందించిన వేణు శ్రీరామ్. వేణు శ్రీరామ్ చెప్పిన కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట బన్నీ.  ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తాడట.  

Recent News