ఇళయరాజా .. సంగీత ప్రపంచంలో చెరగని స్థానం సంపాదించి .. మ్యూజిక్ మాస్ట్రో గా నిలిచిన లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇప్పుడు నటుడిగా మారుతున్నాడు. ఏంటి ? షాక్ అవుతున్నారా !! మీరు విన్నది నిజమేనండి బాబు .. !! అసలు విషయం ఏమిటంటే .. ఈ మధ్య దేశంలో ఏ భాషలో చూసినా బయోపిక్ సినిమాలు ఎక్కువవుతున్నాయి .. ఈ నేపథ్యంలో ఇళయరాజా జీవిత కథతో సినిమా తీయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ సినిమా కనుక తెరకెక్కిస్తే అందులో నటించేందుకు నేను రెడీ అంటూ చెప్పేసాడు ఇళయారాజా. ఓ సామాన్య కుటుంబంలో పుట్టి .. అంచెలంచెలుగా ఎదిగిన ఇళయరాజా జీవితం అందరికి ఆదర్శం. మ్యూజిక్ లో ఎన్నో ప్రయోగాలు చేసి తన సంగీతంతో ప్రేక్షుకుల హృదయాల్లో సుస్థిర స్తానం సంపాదించుకున్న అయన తన ఇన్నేళ్ల కెరీర్ లో ఎప్పుడు తెరముందుకు రాలేదు .