తెలుగు, తమిళ, మలయాళ, హిందీ , అబ్బో ఏ భాషలో వెదికినా ఆయా రాష్ట్రాల్లో .. పాపులర్ అయిన వ్యక్తుల జీవితాలు తెరకెక్కించేందుకు దర్శక నిర్మాతలు ఓ రేంజ్లో ప్రయత్నాలు మొదలు పెట్టేసారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో సంచలన బయోపిక్ తెరకెక్కనుంది. అది ఎవరిదో కాదు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బి ఎస్పీ అధినేత మాయావతిది. దీదీ గా క్రేజ్ తెచ్చుకున్న మాయావతి జీవిత కథతో తెరకెక్కే సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి. సుభాష్ కపూర్ దర్శకత్వం వహించే ఈ సినిమాలో మాయావతి పాత్రలో ఎవరు నటిస్తారన్న విషయంపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పలువురి పేర్లను పరిశీలించిన దర్శకుడు క్రేజీ హీరోయిన్ విద్యా బాలన్ తో ఈ పాత్ర చేయించాలని ప్లాన్ చేసాడట. కథ చెప్పి ఒప్పించడం కూడా జరిగిపోయాయని వార్తలు వస్తున్నాయి. మాయావతి జీవితం ఎన్నో ఒడిదుడుకులతో సాగింది. ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చాక ఆమె ఎన్నో విమర్శలు ఎదుర్కొంది . మొత్తానికి సంచలన చిత్రంగా మాయావతి బయోపిక్ ఉంటుందన్న వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.