నో పాలిటిక్స్ అంటున్న మాధురి

30 Mar,2019

ఈ మధ్య సినిమా వాళ్ళందరూ దాదాపుగా రాజకీయాలోకి ఎంట్రీ ఇవ్వడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే కొందరు నటీనటులు ఆయా పార్టీలో చేరడంతో ఇంకొందరు కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు తెగ వార్తలు వస్తున్నాయి. తాజాగా మాజీ గ్లామర్ భామ మాధురి దీక్షిత్ కూడా రాజకీయాల్లోకి వస్తుందంటూ మీడియా కోడై కూస్తుంది. ఈ విషయం పై మాధురి స్పందిస్తూ .. నేను ఏ పార్టీలో చేర‌బోన‌ని బాలీవుడ్ స్టార్ న‌టి మాధురీదీక్షిత్ తెలిపింది. లోక్‌స‌భ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాననే వార్తలు పుకార్లు మాత్రమేనని కొట్టిపడేసింది. తాను ఏ పార్టీ తరపున పోటీ చేయబోనని… ఇప్పటికే దీనికి సంబంధించి క్లారిటీని కూడా ఇచ్చానని.. తనతో పాటు మరో ఇద్దరు యాక్టర్లపై కూడా ఇలాంటి ప్రచారమే జరుగుతోందని తెలిపింది. మొత్తానికి రాజకీయాలకు తాను దూరమని చెప్పింది మాధురి. 

Recent News