టాలీవుడ్ స్టార్ హీరో గోపీచంద్ తిరిగి షూటింగ్ లో పాల్గొనేందుకు రెడీ అయ్యాడు. ఈ మద్యే తన 26 వ సినిమా షూటింగ్ లో పాల్గొన్న సమయంలో జరిగిన యాక్సిడెంట్ లో గోపిచాంద్ గాయపడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న అయన ఈ గాయం నుండి కోలుకుంటున్నాడు. తిరు దర్శకత్వంలో రూపొందుతున్న తన 26వ చిత్రం షూటింగులో పాల్గొనడానికి రెడీ అవుతున్నాడు. ఏప్రిల్ 10 నుంచి జరిగే ఈ సినిమా తదుపరి షెడ్యూల్ లో గోపీచంద్ పాల్గొంటాడు.