గోవా షూటింగ్ పూర్తీ చేసుకున్న ఇస్మార్ట్ శంకర్

28 Mar,2019

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో యంగ్ హీరో రామ్ నటిస్తున్న ఇస్మార్ట్ శంకర్ ఇటీవలే గోవా లో ఓ షెడ్యూల్ ని పూర్తీ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ని కాశి లో తెరకెక్కిస్తారట. ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మధ్య వరుస పరాజయాలతో టెన్షన్ మీదున్న పూరి జగన్నాద్ కి ఇప్పుడు సరైన సక్సెస్ కావాలి  అందుకోసం అయన ఈ ఇస్మార్ట్ శంకర్ ని నమ్ముకున్నాడు. ఈ మధ్య రామ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. వీరిద్దరికి సరైన సక్సెస్ కావాలి కాబట్టి దానికోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. కాశీ తరువాత షెడ్యూల్ ని హైదరాబాద్ లో జరపడంతో టాకీ పూర్తికానుంది. స్పీడ్ గా సినిమాలు తీయడంలో పూరికి మరెవరు సాటి రారన్న విషయం తెలిసిందే .. అందుకే ఈ సమ్మర్ ని కాష్ చేసుకునేందుకు పూరి ఇస్మార్ట్ శంకర్ తో వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  
 

Recent News