సూపర్ స్టార్ రజని కాంత్ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. నిజానికి పేట, 2. ఓ సినిమాల తరువాత అయన పూర్తిగా రాజకీయాల్లోకి వెళతాడని అనుకున్నారు. కానీ దానికి బిన్నంగా రజని సినిమాలపైనే ఫోకస్ పెట్టడం అటు రజని ఫాన్స్ ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. లింగా, కబాలి, కాలా సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడం ఎన్నో ఆశలు పెట్టుకున్న 2. ఓ కూడా యావరేజ్ గా నిలవడంతో కాస్త కేర్ తీసుకున్న రజని పేట చిత్రంతో మళ్ళీ మంచి హిట్ అందుకుని అదే స్టైల్ లో సినిమాలు చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మురుగదాస్ చెప్పిన కథ నచ్చడంతో ఓకే చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 10 నుండి మొదలు పెట్టాలని ప్లాన్ చేసారు. అయితే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ షూటింగ్ ని ఆపమని చెప్పారట. దాంతో ముందు అనుకున్నట్టు కాకుండా ఏప్రిల్ చివరి వారంలో మొదలు పెట్టె అవకాశాలు కనిపిస్తున్నాయి. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నా విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది.