తెలుగులో ప్రముఖ కొరియోగ్రాఫర్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న వారిలో జానీ మాస్టర్ ఒకరు. దాదాపు అందరు స్టార్ హీరోలతో పని చేసిన అయన, తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే జానీ మాస్టర్ పై కేసు నమోదైంది. 2015 లో అయన పై పలు చెక్ బౌన్స్ కేసులు నమోదు అయ్యాయి. దాంతో పాటు మరి కొన్ని కేసులు కూడా ఉండడంతో, కేసును పరిశీలించిన కోర్టు అయన పై 324, 354, 506 సెక్షన్స్ లో కేసులు పెట్టారు .. అయితే సెక్షన్ 354 ని కేసు కొట్టి వేయగా .. మిగిలి రెండు సెక్షన్స్ కింద జానీ మాస్టర్ తో పాటు మరో ఐదుగురికి 6 నెలల జైలు శిక్ష విధించింది మేడ్చల్ కోర్టు. జానీ మాస్టర్ జైలుకు వెళుతున్నాడన్న విషయం పై టాలీవుడ్ లో పెద్ద దుమారం రేపుతోంది. జానీ మాస్టర్ నితిన్ హీరోగా నటించిన ద్రోణ 2009 సినిమాతో కొరియోగ్రాఫర్ గా ఎంట్రీ ఇచ్చాడు .. ఆ తరువాత రామ్ చరణ్ నటించిన రచ్చ సినిమాతో మంచి ఫామ్ లోకి వచ్చాడు. రచ్చ పాటలకు జానీ మాస్టారు ఇచ్చిన స్టెప్పులు చుసిన పలువురు స్టార్ హీరోలు తమ సినిమా పాటలకు జానీ మాస్టర్ కావాలని కోరేవారంటే అయన టాలెంట్ ను అర్థం చేసుకోవచ్చు. దాదాపు యాభై కి పైగా చిత్రాలకు కొరియోగ్రఫీ అందించిన జానీ మాస్టర్ ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ టెన్ కొరియోగ్రాఫర్స్ లో ఒకడిగా నిలిచాడు. మొత్తానికి చెక్ బౌన్స్ కేసుతో జానీ మాస్టర్ దోషిగా నిలబడ్డాడు.