హర్రర్ సినిమాలో తెలుగు హీరోయిన్

28 Mar,2019

తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా రూట్ మారుస్తోంది. ఇప్పటివరకూ రెగ్యులర్ లవ్ స్టోరీస్ ను మాత్రమే ఎంచుకుంటూ ముందుకు సాగిన వరంగల్ బ్యూటీ ఈషా తన కెరీర్ లో మంచి బ్రేక్ కోసం మొదటిసారిగా ఒక హారర్ ఫిలిం కు గ్రీన్ సిగ్నల్ ఊపిందని సమాచారం.  ఈ థ్రిల్లర్ చిత్రానికి శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహిస్తాడట. 'టాటా బిర్లా మధ్యలో లైలా'.. 'యమగోల మళ్ళీ మొదలైంది'.. 'ఢమరుకం' లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన శ్రీనివాసరెడ్డి ఈషా కోసం ఒక మంచి కథ ను రెడీ చేశాడట. నిజానికి  నాగ చైతన్యతో ఒక సినిమా చేసేందుకు శ్రీనివాస రెడ్డి చాలాకాలం ప్రయత్నించినా వర్క్ అవుట్ కాకపోవడంతో ఆ ప్రాజెక్టును పక్కన పెట్టి ఒక హారర్ కథతో ఈషాను సంప్రదించాడట. కథ నచ్చడంతో ఈషా వెంటనే ఒకే చెప్పిందట.   నటన పరంగా.. గ్లామర్ పరంగా మంచి గుర్తింపు సంపాదించుకున్నా ఈషాకు సరైన బ్రేక్ రాలేదు.   అందుకే ఈసారి మాత్రం హారర్  థ్రిల్లర్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధిస్తానని నమ్మకంగా ఉందట. హారర్ చిత్రాల ద్వారా భారీ గుర్తింపు సాధించిన వారిలో అనుష్క.. నయనతార వంటి టాప్ లీగ్ హీరోయిన్లు ఉన్నారు.  మరి వీరి బాటలో ఈషా కూడా తన సత్తా చాటుతుందా  అనేది వేచి చూడాలి.

Recent News